పుట:Andhrula Charitramu Part 2.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తండ్రి లని చెప్పు నాచరము కలదు గావున గన్నయ్యరెడ్డి కుమారుడైన బుద్ధారెడ్డి పినతండ్రియైన వితలధరణీకునికి గృతి నొసంగుచు తండ్రి యని పేర్కొని యుండె నని యూహించుచున్నారు 1

బుద్ధారెడ్డి కూతురు కుప్పామాంబ శాసనము

   గోనబుద్ధారెడ్డికి కుప్పమాంబ లేక కుప్పసానమ్మ యను నొక కొమార్తె గలదు.  ఈమశాసనములు బూదవూరు, వర్ధమానపురములలో రెండు మూడు గలవు. ఈమె తానబూతుపూరి శాసనములొ నీక్రిందివిధముగా ఈశ్వర భట్టోపాధ్యాయుల వారిచే నబివర్ణింపబడినది.

"శ్రీగోనవంశనిజశేఖరబుద్ధయాఖ్యపుత్రీ పవిత్రచరితా భరితాగుణౌఘై:
  శృంగారసారకరణీ: కరణీయదక్షా కుప్పాంబి కాజని చతస్య సతీ కళత్రం

   బుద్ధారెడ్డి యింటిపేరు గోనవారుకాని కోనవారు కాదని గనంబడుచున్నది.  రంగనాధరామాయణముద్రణకర్తలు గోనశాబ్దమును కోనశబ్దముగ మార్చినట్లు గన్పట్టుచున్నది.  అయినను తెలుగుభాషలో కకారము గకారముగా నుచ్చరింప బడు పదము లనేకములు వాడుకలో గలవు. ఈగోనబుద్ధారెడ్ది కూతు రయిన యీ కుప్పమాంబ కాకతి మహాదేవరాజు వంసమునందు జనించి కాకతి రుద్రదేవీ ప్రసాదాసాదిత  రాజ్యలక్ష్మీ నివాసుండైన శ్రీమల్యాల గుండదండాధీశ్వరుని కిచ్చి వివాహము చేయంబడియెను.  ఈమె శా.శ.1198 ధాతుసంవత్సర మాఘశుద్ధ దశమిఈ గురువారమునాడు స్వర్గస్థుడైన తనభర్త గండయపేరును లింగప్రతిష్ట గావించి బూదుపూరను పోతుమడుగున భూదానమ్ల ననేకములను గావించెను. ఈశాసనమును బట్టి క్రీ.శ.1276 వ సంవత్సరము నాటికి నీమ భర్త మృతి  నొందె ననియు, ఈమెకు బాబయి, బొప్పండు, గణపతిదేవుడు, పర్వతము మల్లయ యను కొడుకులును, మల్లయ, బుద్ధయ, నిక్ధయ, కాటయ, పిడుగుగుండయ యను తమ్ములను

1. Tlhe Lithici Records in Hyderabad by M.Ramakrishna Kavi M.A. The Rachur Inscription of Gona Gannayya Reddi.