పుట:Andhrula Charitramu Part 2.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దండు డనియు, నిజకీర్తిపూరిత బ్రహ్మాండకరండుం డనియు, పరబలోద్ధండు డనియు, శ్రీసోమనాధదేవ దివ్యశ్రీపాదపద్మారాధకుం డనియు, పరబలిసాధకుం డనియు, అనేకబిరుదునామములతో నభివర్ణింపబడియుండెను. ఇతడు సంతతార్చిత శశిమౌళి యని పేర్కొనబడుటచేతనే శివభక్తుడని తెల్లమగుచున్నది. ఇతడువర్ధమానపురమునందుండి ప్రభుత్వము సేయుచుండగా తద్రాజ్యరక్సామణియైన వికలనాధుడు శ్రీనారాయణదేవదివ్య శ్రీపాదపద్మారాధకుం డని పేర్కొనంబడి యుండుటచేత నాతడు విష్ణుభక్తు డని వేద్య మగుచున్నది. ఈవికలనధుటు ఆదవని, తంబుకము, మామన, హాలువ దుర్గములు సాధించినట్లుగా రాచూరుశాసనమున లిఖియింప బడినది. పైన గన్నయ్య రెడ్డికి జెప్పబడిన విశేషణములళొ బేర్కొనంబడిన పట్టణము లన్నియును రాచూరుమండలములోనివిగ నున్నవి. ఆపట్టణముల యొక్కయు వాని నాయకులయొక్కయు చరిత్రమును దెలుపునట్టి శాసన ప్రమాణము లేవియు దొరికియుండనందున జెప్పు"టకు సాధ్యపడదు.

గోనబుద్ధారెడ్డి రంగనాధరామాయణము.

    ఈగోనగన్నారెడ్డి రంగనాధరామాయణమును రచించిన గోనబుద్ధరెడ్డి తండ్రి యను నేమో కొంచెము విచారింపవలసి యున్నది.  రంగనాధుండను నాతడు రామాయణమును ద్విపదకావ్యముగా రచియించెను. కంజుకనే యాగ్రంధమునకు  రంగనాధరామాయణ మను పేరు గలిగిన దని చెప్పుదురుగాని గ్రంధమునందు గోనబుద్దరాజు రచించినట్లు గానంబడుచున్నది.  మనుమూరి సంస్థానాధిపతి యగు బుద్ధరజున కాశ్రితు డయిన రంగనాధు డనుకవి తన ప్రభువుపేరిట రచించెనేకాని బుద్ధరాజురచించియుండు నేని బుద్ధరాజు రామాయణ మను పేరే నిలిచి యుండునుగాని రంగనాధరామాయణమను పేరు నిలిచియుందుటకు గారణము గానరాదనియును, గొందఱు చెప్పుదురు.  మఱికొందఱు రంగనాధుడు  బుద్ధరాజునకు బంధుడనియు దూపాడుపరగణా కధికారిగ నుండె ననియు జెప్పుదురు. ఈగ్రంధము