పుట:Andhrula Charitramu Part 2.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రుద్రాంబ రాజ్యభారమును పూనుట

     కాబట్టి కాకతి గణపతిదేవ చక్రవర్తి తనకు పురుషసంతానము లేని కారణమున తనకొమార్తలలో నొకతెయగు రుద్రదేవిని కుమారునిగా భావించుకొని యామెకు రుద్రదేవుండనియె నామమును పెట్టి పెంచె నని ప్రతాపరుద్రీయమను గ్రంధమును బట్టి మనము తెలిసికొని యున్నాము.  కాకతి గణపతి చక్రవర్తి మరణానంతరము రుద్రదేవి రత్నసింహాసన మధిస్థింఇ యాంధ్రసామ్రాజ్యభారము ను వహించి మిక్కిలి మనోరంజకముగా బరిపాలనము సేయ నారంభించెను.
   ఈమె శా.శ.1182వ సంవత్సర మనగా క్రీ.శ.1260 దవ సంవత్సరములో సింహాసన మెక్కెనని త్రిపురాంతకశాసనములో నొక టివున్నదని బోధపడుచున్నది.1
   ఈమె రుద్రదేవమహారాజు" అను నామముతో వ్యవహరింపబడుచు వచ్చెను. ఈమె యెప్పుడును పురుషవేషముతోనే కొల్వుకూటమునకు నేతెంచి మంత్రుల తో రాజ్యాంగ విషయములను గూర్చి ముచ్చటించుచుండెనని తెలియుచున్నది.  ఈమె చక్రవర్తి పుత్రికయగుటం జేసి యీమె కీర్తియ లోకమున వ్యాపించెనుగాని యీమె భర్త యెవ్వరో యాయన చరిత్ర మెట్టిదో యాంధ్ర ప్రపంచమంతవఱకు నెఱుంగదు. భర్త సామాన్యుడగుటచేతనో అకాలమృత్యువు వాతంబడుటచేతనో యాతని నామము ప్రసిద్ధమై యుందకపోయెను. ఇంతియగాక గణపతి చక్రవర్తికి బిమ్మట రాజ్యభారమును వహించినదగుటచేత నతని భార్యయని యాంధ్ర ప్రపంచముము భ్రాంతిం జెందెను.

రుద్రాంబిక భర్త.

     గోదావరీమండలములో దక్షారామ మనుగ్రామంబున నుండు శ్రీభీమేశ్వస్వామి వారి యాలయములో నొకశాసనములో "కాకతి గణపతి

1. Epigraphical Report for 1905-6.