పుట:Andhrula Charitramu Part 2.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అని పురోహితుడు రుద్రాంబికతల్లి సొమాంబను ఉమాదేవిని యనియు, తండ్రియైన గణపతిని శివు డనియు రుద్రాంబికతో పలికినట్లుగా జెప్పంబడినది.

 ఇదివఱకే వ్యాఖ్యాత రుద్రాబిక గణపతిదేవుని భార్య యని చెప్పి యున్నవాడగుటచేత

"వ్యా. రుద్రాంబాయా, పితరౌ సోమంబాగణపతిదేవా తయో రుమా
        మహేశ్వరాత్మకత్వం లోకవిదితం తత: స్వయంభూమహా రాజయో:
        పితాపుత్త్రభానోzస్తి."

     అని వ్రాసి యీసోమాంబయు గణపతియు కాకతీయులు గాక వే

ఱు కుటుంబములోని వారని భావించెను. ఈవిషయమునుగూర్చి ప్రతాపరుద్రీయములో నాటకప్రకరణములో అంకారంభమునపురుష నామమును దాల్చి పురుషవేషముతో నున్న రుద్రాంబికతో పురోహితుండును మంత్రికిని జరిగిన సంబాషణములను గూర్చిన శ్లోకముల నుదాహరించిన యెడల నందలి నిజము చదువరులకు విస్పష్టము కాగల దను భావముతో వాని నిట నుదాహరించుచున్నాను.

   "తత్ర ప్రవిశతి యధానిర్ధిష్ట వేషో రాజా చామరగ్రాహిణీచ
 రాజా,---సహర్షాతిశయం: అయే ప్రసారాతిశయ: పరమేశ్వరస్య
     శ్లో. సోమార్కాభిజనం త మధ్య జయతీ శ్రీకాకతీయా న్వయం,
         పాతివ్రత్య మునైతి సాంప్రత మమీ ష్వస్మాను విశ్వంభరా
         ఆస్మాణ్భి ర్నీజదో:ప్రసూతి మధునా ధన్యామతోమన్యతే
         యత్కర్తవ్య ముపాదిశ త్కులపతి ర్దేన స్స్వయంభూ స్స్వయమ్:
         పురోధస:--మహారాజ భవాదృశా ఏవ పర మర్హంతి తాదృశో
         మహిమ్నో దేవస్యహితోపదేశాన్: అధవాకి మత్రాభినవం: పుత్రా
        ణాం హితోపదేశాధికార: పితు రేవ య ధేస్థం కధయంతి తద్విద: "