పుట:Andhrula Charitramu Part 2.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వాడని పై శ్లోకమునందు జెప్పబడి యుండుటచేత వ్యాఖ్యాత పాలకులకు దానిని బోధపఱచుటమై పైని వ్యాఖ్యానములో వివరించినవిధముగ రుద్రమదేవి గణపతిభార్య యని సంబంధమును దెలిపియుండెను.

     రుద్రమహాదేవ గణపతిభార్య యని గ్రంధకర్తల్ లనేకులు వారికిందోచినట్లుగ వ్రాయుట వింతగా నుందక మానదు.వచనసోమదేవరాజీయమునందు "గణపతి సకలసేనాసమేతుండై మహాదేవరాజసమేతముగ దేవగిరిమీదికి దండు వడలి వారితోమాసత్రయంబు యుధము చేసి యందు గదాయుద్ధమున మహాదేవరాజు సమసిన నది గని గణపతిమహారాజు క్రోధాన్వితుడై జగడంబు చేసి దేవగిరిరాజును జంపిన వారు శరణాగతులై తమ కూతురగు రుద్రమహాదేవిని గానుకగా బెట్టిన నాలడుచును  గైకొని యేకశిలానగరమునకు వచ్చెను." అని రుద్రమదేవి దేవగిరి యాదవరాజు కుటుంబమున జనించిన దని కూడ చెప్పిరి. ఇది పద్యకావ్యము ననుసరించి వ్రాయబడిన వచనకావ్యము గావున నక్కడగూడ ఇదే రీతిగ జెప్పబడియేయుండును. ఇట్లే స్థానిక చరిత్రమునందును వ్రాయబడినది. మార్కో పోలో వ్రాతనును బట్టి పాశ్చాత్యులు కూడ కొందఱు భార్య యని వ్రాసిరి. వీని నన్నిటిని జూచి ఆంధ్రకవుల చరిత్రములో శ్రీ వీరేశలింగముగారు రుద్రమదేవి గణపతిభార్య యని వక్కాణించియున్నారు.  కీర్తిశేషులయిన శ్రీరామమూర్తి గారును కవిజీవితములయందు మొదట గణపతిభార్య రుద్రమదేవి యని యూగాహరించినారు గాని డాక్టరుహల్ ట్టుగారు "ఇండియన్ అంటిక్వెరీ" లో వ్రాసిన లేఖనము జూచిన తరువాత వెనుకటి యభిప్రాయమును మార్చుకొనిరి. హిందూదేశకధాసంగ్రహములో ప్రధమభాగమున శ్రీ కొమరరాజు లక్ష్మణరావు  

ఎం. ఏ గారు కూడ రుద్రమదేవిని గణపతిభార్య యనియె చెప్పి యున్నారు. ఇంతియ గాకక్రిందటి సంవత్సరము ప్రకటింపబడిన శ్రీ వెలుగోటివరి వంశచరిత్రమునందు సయితము రుద్రాంబిక గణపతిదేవుని కూతురను వారము గలదని యెఱింగియు విమర్శింపక దానిని విస్మరించి రుద్రమదేవి గణపతిభార్య యని కంశోక్తిగా జెప్పబడియెను. ఇట్లుందఱు