పుట:Andhrula Charitramu Part 2.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లచే జెప్పుకొనబడునట్టి గాధలను బరిష్కరించుకొని వ్రాయబడినవి. ఈగాధలను వినియుండుటచేతనే కాబోలు మహామహోపాధ్యాయ కోలచల మల్లినాధసూరిగారి పుత్రుడగు కుమారస్వామి సోమయాజిగారు సంస్కృత ప్రతాపరుద్రీయమునకు వ్రాసినవ్యాఖ్యములో నొకచోట

  " పురా కిల కాకతికులసంభూతే గణపతినామ్ని మహారాజే,ధుహితృ
     మాత్రసంతానే, కదాచి ద్దైవ యోగేన కాటపరిపాక ముషేయుషి,
     తన్మహీషీ రుద్రదేవీనామ రాజ్ఞీ, బహూని వర్షాణి తద్రాజ్య మకం
     టకం పరిపాల్య, పరిణతా సతీ దౌహైత్రేప్రతాపరుద్రే రాజ్యధురాం
     విదధే. తామిమాం కధాం మనసివిధా యాహ యో రుద్ర ఇతి"
    అని వ్రాసియున్నాడు.

   పూర్వము కాకతికులసంభూతు డగు గణపతిమహారాజు పుత్రికా సంతానము మాత్రముకలవాడై దైవయోగముచేత గాలగ తిని జెందంగా నతని భార్యయగు రుద్ర్రంబిక రాజ్యభారమును వహించి అనేక సంవత్సరములు నిష్కంటకముగా బరిపాలనముచేసి తాను వృద్ధురాలగుటయును, తన దౌహిత్రుడు వయస్సు వచ్చిన వాడగుటయును తలపోసి రాజ్యభార మాతనికి నొప్పగించె నని తాత్పర్యము.  ఈ మహావ్యాఖ్యాత ఇట్టి భ్రమ నొందుటకు కారణం ప్రతాపరుద్రీయములో

   "శ్లో. యో రుద్రోరజతాచలే స్థితి మర్ధాంగవారి: పురా
         సోzయం సంప్రతికాకతీశ్వరక్షులే సర్వార్గవారి: స్థిత:
         స్థానే యర్విస మావలోకనికళామాత్రేణ భస్మీకృతా
         వ్యాస నైస్వరపురాణి చిత్ర మధునా ఖడ్గే విషం ధార్యతే"

     అని మొదలు గాగల చోటుల బుంలింగమే ప్రయోగింప బడియుండుటయ గాని యన్యముగా గనుపట్టదు.  అర్ధాంగనరియై కైలాసమందున్న రుద్రుడు కాకతివంశమునుండు బూర్ణముగ స్త్రీశరీరమునే ధరించియున్న