పుట:Andhrula Charitramu Part 2.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భూతు డైనవాడు శివదేవయ్య యనునాతని ప్రధానమంత్రియె గాని యన్యుడు గాడని యిదివఱకె దెలిపియున్నాను. ఈ శివదేవయ్య యని నై యోగి కారాధ్య బ్రాహ్మణుడు రాజ్యతంత్రజ్ఞుడు మాత్రముగాక పండిత కవియుం గూడ నై యుండెను. అత డాంధ్రమున *"పురుషార్ధసారం" మను నీతిగ్రంధమును రచించెను. ఇందలి కవనము మృదు మధుర పద ఘటిత మై యెప్పుచున్న దని దెలుపుటకై రెండు పద్యములను మాత్ర మీ దిగువ నుదాహరించుచున్నాను.

   "క. ప్రజ జెఱిచి కూడ బెట్టిన
        నిజధన మది వలయు వ్యయము నిచ్చలు జేయన్
        బ్రజయును ధనమును బొలిసిన
        భుజబలమున విలువ దలమె భూపతి కెందున్."
    క. జనలక్ష్మికి ధనలక్ష్మికి
        ననుపమ మగుధర్మలక్ష్మి కాత్మ;య మూలం
        బని యాత్మరక్ష మఱవక
        జననాధుడు నేయవలయు సతతం ప్రీతిన్."

    కాకతి గణపతిదేవ చక్రవర్తికి బుత్త్రికా సంతానమె గాని పుత్త్ర సంతానము లేక యుండెను. ఈయనకు గణపాంబ రుద్రాంబ యను నిరువురు కొమార్తలు గల రని యింతకు బూర్వమే దెలిపియున్నాను.  ఇతడు తన పెద్దకొమార్త యయిన రుద్రాంబను కుమారునిగ  భావించుకొని యామెకు విద్యా బుద్ధులు గఱపించి రాజ్యతంత్రమున్ గలిగించి తనకు బిమ్మట నామెయె సింహాసనా రూఢయై యాంధ్ర సామ్రాజ్యమును బరిపాలింప నియమించి యఱువదిరెండు సంవత్సరములు ప్రజారంజకముగ నిరంకుశపాలనము చేసి మిక్కిలి వృద్ధుడై క్రీ.శ. 1260 దవ  సంవత్సరమున స్వర్గస్థుడై కీర్తిశేషు డయ్యెను.

   * ప్[ఉరుసార్ధసార మనుగ్రంధము శివదేవయ్యచే రచింపంబడిన దని శ్రీయుత మానపల్లి రామకృష్ణకవి ఎం.ఏ గారిచే బ్రకటింప బడిననీతిశాస్త్రముక్తావళిగ్రంధ పీఠికలో వ్రాయబడింది.