పుట:Andhrula Charitramu Part 2.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యోడలు వాయుద్ళమున నీ రేవున మెఱక పట్టి పోయిన యెడల నాసరకుల నోడగొందలు కొల్లగొనకుండ గట్టడచేయుటయే గాన వర్తకుల్ నిర్భయముగా రాక పోకలు జరుపుకుం దగిన మార్గముల నేర్పఱచెను. ఎగూతి దిగుమతి సరకుల ప శుల్కపరిమాణము ముప్పదింట నొక్కటిగ నిర్ణయించెను. శ్రీగంధము 1 కి గ్ 1, పచ్చకర్పూరమునకు, చీరికర్పూరమునకు, ముత్యాలకు వెల గ 1 కి 60॥కై, పనీరు దంతము, జవ్వారి, కర్పూరతైలము, రాగి, తగరము, సీసము, పట్టునూలు, పదడము, గంధద్రవ్యములకు వెల గ 1 కి 61-, మిర్యాలు వెల గ కి 61- పట్టుస్వరూపము 1 కి గ్ ఇ1కి 61॥

        ఈ రీతి సుంకము విధింప బడియెను.  ఈసరకుల నామమును బట్టియే యాకాలము నం దారేవుపట్టణ మెంతప్రసిద్ద మైనదిగ్ నుండెనో, ఏయే దేశములతోడ వ్యాపారము చేయుచుండేనో వేఱుగ జెప్ప నక్కఱలేకయే భొదపడక మానదు.  కాకతిగణపతిదేవచక్రవర్తియొక్క కృపావిశేషము చేతనే యా రేవుపట్టణము పునరుద్దారణము గావింప బడుటయు, అతని కొమార్త యైన రుద్రమదేవికాలమున వెనీసువర్తకుండైన "మార్కోపోలో" అనువానిచేత శ్లాఘింప బడుటయు సంభవించినది. కాకతిగణపతి సిద్దయదేవ మహారాజును మోటుపల్లికి బాలకునిగ నియమీంచెను.

ధ ర్మ ప రి పా ల న ము.

  ఈ యాంధ్రచక్రవర్తి ప్రభుత్వకాలమున ధర్మము వర్ధిల్లె ననియు, ద్విజులలో బ్రముఖు లైన వార లున్నతపదవులకు వచ్చి రనియు, వృద్ధుల యెడ గౌరవము, ప్రేమ, మొదలగువారిని ప్రజలు కలిగి యుండి రనియు, శాస్త్రజ్ఞానము, కళలు వివసింప జేయబడిన వనియు, పల్నాటిలోని దుర్గి పట్టణమున గంగయ సాహిణిచే లిఖియింపబడిన దానశాసనములో నుదాహరింపబడియెను. ఈ గంగయాసాహిణికి మంత్రిగ నుండిన నామయిపండితుడు దుర్గయపట్టనమున తన తండ్రికి బుణ్యము ప్రాప్తించుకొఱకు సంకేశ్వరాలయమును నిర్మింపించె నని దెలియుచున్నది.  కాకతి గణపతిదేవచక్రవర్తి ప్రజారంజకముగ బరిపాలనముసేసి సత్కీర్తి నడయుటకు గారణ