పుట:Andhrula Charitramu Part 2.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రామము ప్రసిద్ధమైన రేవుపట్టణముగా నుండి చీనా, బర్మా, పారసీకము మొదలగు విదేశములతో, వాణిజ్యము నెఱపుటకు నాంధ్రదేశములో నొక ప్రధాన స్థాన మ;య్యె నని యాంధ్రులచరిత్రము ప్రధమభాగమున సవిస్తరముగా వ్రాసి యున్నాను. ఈ మోటుపల్లికే వేలానగర మని నామాంతరము గలదు. ఈ వేలానగరము ఆంధ్రచోడుల కాలమునను ప్రసిద్ధి కెక్కిన పట్టణముగ నున్నను క్రమక్రమముగా చాళుక్యుల పరిపాలనానంతరము వాణిజ్యము క్షీణింప నంతగా గణనకు రాక యుండెను. మోటుపల్లికడ మెట్టపట్టిన యోడలలోని సరకులను ఆ సమీపమునందలి మండలేశ్వరులు కొల్లగొనుచుండుటచేత నావికు లారేవునకు జేరుటకే భయపడు చుండిరి. అందువలన బ్రసిద్ధి గాంచిన వర్తకు లెవ్వరు నాపట్టణమున నివాసముగా నుండక పోయిరి. కాకతి గణపతిదేవచక్రవర్తికి బూర్వము కొంతకాలమునుండి విదేశవ్యాపారము నడుపునట్టి వర్తకులకు నభయశాసన మీగల చక్రవర్తి గాని మహారాజుగాని లేనందువలనే యాప్రసిద్ధమైన రేవుపట్టణమున కాగతి పట్టేను. గణపతిచక్రవర్తి తాను సింహాసమారూఢుడై వెలనాటిని జయించిన పిమ్మట నీ వేలానగరము నుద్ధరించి విదేశవ్యాపారమును పెంపునొందింపవలయు నన్న సంకల్పము మనస్సున నంకురించిన వెంటనే యుపేక్షింపక మంత్రులతో నాలోచించి యందులకుం దగిన ప్రయత్నములను గావించెన్. అప్పు డా గణపతిచక్రవర్తి వర్తకులకు నభయశాసన మొసంగెను. "నా జీవితముకన్నను నాప్రజలసంరక్షణమె నాకు నెక్కువ ప్రీతికర మైన విషయ" మని యా యుభయశాసనమున వ్రాయించెను. మఱియు నాశాసనమువలన సత్ప్రభుత్వముయొక్క ధర్మములను గాపాడుటకును, కీర్తి కొఱకై యధికాభినివేశముతో సముద్రయానము చేసి విదేశములతో వ్యాపారము చేయునట్టి వర్తకులయందలి ప్రేమచేత నొక్క కూపశుల్కముమాత్రముగాక తక్కిన సుంకముల నన్నిటిని వదలివేసితి మని లిఖింపబడియె;ను. ఉత్తరము నుండి దక్షిణమునకు గాని, దక్షిణమునుండి యుత్తరమునకుగాని పోవునట్టి