పుట:Andhrula Charitramu Part 2.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పదునొకండవ పకరణము

                                   -----

గణపతిదేవుని పరిపాలనము.

                              -------
   కాకతిగణపతిదేవుడు సింహాసనారూఢు డైనవెనుక నాంధ్రభాష మాతృభాషగా చేసికొన్న మహాజనుల నెల్లర నాంధ్రసామ్రాజ్యముక్రిందికి దీసికొని రాగోరి యెట్టి ప్రయత్నములకు గడంగెనో అట్టి ప్రయత్నములన్నియు నీశ్వరానుగ్రహంవలన గొనసాగి జయప్రదము లయినవి  మండూకము నొకదాని మ్రింగ నోరప్పలించుకొని వచ్చి పైబడెడు భుజగేంద్రంబుల నొక్కొక్కదాని నదిమిపట్టి పెట్టలో బెట్టి వశపఱుచుకొనునట్టి ప్రజ్ఞాధురంధరుం డయిన యొక గారడివాని సగిది సమరగాంగేయు డని వీరాగ్రగణ్యులచేత ననేకభంగుల గొనియాడంబడెడు మన యీ కాకతి గణపతిదేవ చక్రవర్తి తనకాలమున నాంధ్రసామ్రాజ్యము నాక్రమింప నెదుర్కొను మహామండలేశ్వరుల నొక్కొక్కనినే జయించి గర్వభంము గావించి యదిమిపట్టి కప్పములు గైకొనుచు సామ్రాజ్యూమునకు వన్నెయు వాసి యుం గలుగజెసి సర్వవిధముల బ్రజలు యైశ్వర్యాభివృద్దికై ప్రయత్నించి చాలవఱకు సఫలీకృతమనోరధు డయ్యెను.  అతడ్ మతాబినిరతి కలవాడగుటం జేసి ఘనకార్యనిర్వహణముల నెట్టి యంతరాయముల్ సంఘటిల్లుచు వచ్చినను నిరుత్సాహుడు గాక మరలమరల బ్రయత్నించుచు వచ్చినందున విజయము నొందుచు వచ్చెను.  అతని మంత్రివర్గములొ ప్రముఖుడైన శివదేవయ్య రాజ్యతంత్రజ్ఞు డగుటవలన నాతనిమాట జవదాటక నేర్పుతో రాజ్యపరిపాలనము సేయుచు  వచ్చినందున దక్షిణహిందూస్థానమును బరిపాలించిన చక్రవర్తులలో నధిక ప్రఖ్యాతిని గాంచెను. ఆంధ్రభూమి నంత