పుట:Andhrula Charitramu Part 2.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

      అజిబలాధికు డౌటచే నెంతయు
         బలభీమ విశ్రుతి బొలుపు మీఱె
     బ్రధి తారె రాజన్య భయద విక్రమమున
         బ్రతిగండల్ శైరవ ప్రధ వహించె
    మఱియు బెక్కైన బిరుద నామముల దనరే
       బాహవిక్రమ దాన సంపదలతోడ
   దనరుచుండే సమంతి తొర్ధామ యకుండు
      భువనహితకారి యగు రామభూవిభుండు."

   ఈ పైపద్యములో బేర్కొనంబడిన బిరుదావళుల నేకులు వహించుట యా కాలమునం దచారమై యుండెను.  ఇంతకన్న నీతని చరిత్ర మేమియును యుండలేదు.

ప్రసాదాదిత్యనాయుడు.

   బేతాళనాయని పుత్రులలో నీతడు సుప్రసిద్ధు డైనవాడుగని జెప్పబడియను. ఇతనింగూర్చి రావువంశీయులచరిత్రమునం దొకరీతిగను వెలుగొటివారి వంశ చరిత్రమునందుగలదు.  మఱియొకరెతిగను వ్రాయంబడి యున్నది. "రెందవ కుమారుడైన ప్రసాదదాదిత్యనాయుడును దక్కిన 76 గోత్రముల నాయకులును గాకతీయ గణపతిరాయ్లవారి కొలువుకూటములో నుండగా నొకప్పుడు గణపతి రాయలవారి పట్టణమున శత్రురాజులు ముట్టడిచేసిరి.  అపుడు గణపతిరాయల వారు తమకొల్వులో నుండు 77 గోత్రముల నాయకులను జూచి మీలోపల నెవ్వ రీశత్రువ్లన్ జయింతురో వానిని "నేను గొల్వుకూటములో లేచి యెదురునని తెచ్చి నాసింహాసనము పై గూర్చుందబెట్టుకొందు" ననియు మిగత 76 గొత్రముల నాయకులచే నతనికి మ్రొక్కులు వేయింతు ననియు జెప్పెన్; ఆమాట విని యంద ఱూరకుండగా నెప్రసాదదాదిత్యనాఉడు లేచి నె జయించెద నని విన్నవించి గణపతిదేవునివలన సెలవు నొంది శత్రువులమీద యుద్ధమునకు