పుట:Andhrula Charitramu Part 2.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లుండి నట్లుగా వేంకటగిరీవారి వంశావళిలో నుదాహరింపబడిన యీ క్రింది పద్యములో దెలుపబదినది.

"శా. తారుణ్యప్రధమనృధేక్యు డగు బెతాళావనీభర్త్రకున్
      దీరుల్ పుత్రులు రామభూపతి ప్రసాదిత్యుండు రుద్రక్షమా
      ధారుండున్ జనియించి రంత ద్రిజగద్ధర్మప్రతీపాలనన్
      శ్రీ రాజిల్లగ శౌరిమువ్వు రయి ధాత్రి న్మించినా రెన్నగన్."

పిల్లలమఱ్ఱి రేచ్లాబేతరెడ్దియు పల్నాటివీరుడైన రేచర్ల బ్రహ్మనాయని తాత యగు బెతినాయుడును, చెవ్విరెడ్డి యను నామాంతరము గల పిల్లల మఱ్ఱి బేతాళ నాయుడే యని శ్రీ వెలుగోటివారి వంశచరిత్రమునందు వక్కాణింపబదిన హేతువు లు పరస్పరం విరుద్ధములై పొందిక లెక యున్నవని యాఱవప్రకరణమున సవిస్తరంగా జర్చించి యున్నాను. కాబట్టి యీ బేతాళనాయుడు రేచెర్లవారి కుటుంబములో జేరిన మఱియొక నాయకుడో లేక వెలుగోటివారి పూర్వులు భ్రమ చేత రేచెర్ల బేతినాయనినే యీత డని తమవంశమునకు మూలపురుషునిగా జేసికొనిరో యేమో నిర్ధారింఛుటకును పాలుపోక యున్నది. గావున పరిశోధనమున గాని యిందలి సత్యము బోధపడ జాలదు. అయినను వీరిని రేచెర్ల బ్రహ్మనాయని జ్ఞాతికోటిలోని వారిగా నంగీకరింపవచ్చును. బెతాళనాయని మూరువు పుత్రుల;యొక్క చరిత్రము గూడ సందర్భానుసారముగ రచింపబడి యుండలేదు. వీరిని గూర్చిన శాసనమొక్కటియు నింతవఱకు గానిపింపలేదు. వీరి చరిత్రమున కాధార మంతయు నైనవారు ప్రకటించిన గ్రంధములే యై యున్నవి. ఆ గ్రంధములలోని చరిత్ర మెంతవఱకు విశ్వసింపదగినదో అంతవఱకే మనము గ్రహింపవలసి యుండును.

   "సీ. నటుల ఖడ్గా ఖడ్గ సమరప్రవీడు డై
             ఖడ్గనారాయణ ఖ్యాతి నొందె
        రణ పరాన్ముఖ రాజరమనుజేకొని రాయ
            గాయ గోవాళాంక కలితు డయ్యె