పుట:Andhrula Charitramu Part 2.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బాదన్న యని పల్నాటి వీరచరిత్రమున వ్చవహరింపబడింది. దాబన్న యను నది పద్మన్న యను పేరికి వాడుక గా వ్యవహరింపబడిన నామము. కాబట్టి బ్రహ్మనాయనియన్నయగు పద్ముడు నాయకుడుగా గల కుల మని చెప్పవచ్చును. కాని మౌర్యుడయిన పద్ముడు నాయకుండని చెప్పినచో బొసకనేరదు. ఆపద్ముడు పద్మపాలెకులమునకు సంబందించినవాడుగ గన్పట్టు చున్నాడు. ఎట్లయిన నేమి? పద్మనాయకులు బ్రహ్మనాయని కాలమ్ననే ప్రఖ్యాతిని గాంచి యుండిరి. పద్మనాయకులలోననేకులు మొట్టమొదట రాష్ట్రకూ టులకు రాజధానిగ నుందిన మార్యభేతమున (నున్నె భేదము) నుందుచు వచ్చి యారాజ్య మంతరించిన వెనుక ననేకులు పల్నాటికి వచ్చి చేరిరి. కొందఱు గిరిదుర్గముల కధిపతులై మన్నె లను పేరితో వ్యవహరింపబడుచు వచ్చిరి. వీరిలో ననేకులు మాతంగులు, గోసంగులునై యుండి రనియు, వీరలకు నెఱుమ న్నెలు, సురమన్నెలు నను నామములు గల వనియు చెప్పుటకు గూడ కొన్ని దృష్టాంతములవలన్ నవకాశము కలుగుచున్నది. పద్మనాయకుల జన్మకధ మెట్టిదైనను, ఉత్తరహిందూస్థానమున్ రాజపుత్త్రులనెడు మహావీరు లెట్టిపొరుష పరాక్రమంబులు నెఱపిరో అట్లే యీదక్షిణహెందూస్థానమున వెలమవీర్లు అత్య్లద్భుతము లయిన పౌరుషపరాక్రమములం జూపి వాసి కెక్కిరి. దెవలమవారు, కమ్మవారు రెడ్లు, రాచవారు, తమలో దాము పోరాడక కేవలము దేశాభిమానమే విధ్యుక్త ధర్మమని యైకమత్యముతో నుండిన యెడల దక్షిణ హిందూదేశము ముసల్మానుల కడుగుపెట్ట సాధ్యము గాక యుండెడిది. ఉత్తర హిందూస్థానమున రాజపుత్రులు బోలె ఈ తెగలవారు దక్షిణహిందూస్థానమున బహుశతాబ్ధములు మహమ్మెదీయులతో బోరాడి వాసికెక్కి విద్యానగరసామ్రాజ్య మస్తమింఇన వెనుక దమస్వాతంత్ర్యముల గోలుపోయిది.

దామానాయుడు.

    చెవ్విరెడ్డి యను నామాంతరము గల పిల్లలమఱ్ఱిబేతాళనాయనికి 'దామానాయుడు ప్రసాదిత్యనాయుడు రుద్రనా;యుడు 'అమూవురు పుత్రు