పుట:Andhrula Charitramu Part 2.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

     యనుచు జెప్పుడు రైతిహ్య మచట నచట
     జనపపెద్దలు పల్లెదేశముల;యందు."

   హైహయవంశజుల మయిన క్షత్రియుల మని చెప్పుకొనెడి భావనారు సయితము "గొల్ల సవతి తల్లుల బిడ్డలని" పేర్కొనబబడుచుండ గా బర్మనాయకులు కులమున దక్కినవారలకన్న నెట్లధికు లగుదురో యూహింప నలవిగాక యున్నది.  గొల్లలు ధర్మశాస్త్రమునందు సచ్చూద్రులని పరిగణింపబడి నవారగుటచేత వెలమలను, రెడ్లను, కమ్మవారిక్ గృహసేవకులుగ నుండి వంట మొదలగు పనులు చేయుచుందురు.  నల్లవుడనగా గొల్లవాడని మాత్రమే గాని వంటలవా డని యర్ధము గలదు. పద్మనాయకులలో "నల్లవారిత్యా నల్లనినేత్రా నల్లనచక్రవర్తి" యను బిరుదములు గలవారు నల్లవులయు, వారు 77 గోత్రములలోని వారనియు రావువంశీయుల చరిత్రమున మొదట నుదాహరింప బడిన గోత్రవివరణమూ గూర్చిన పట్టికవలన దెలియుచున్నది.  పద్మనాఅకులలో గొందఱు "గోసంగి వైరి తలగుందు గండా" యను బిరుదును వహించినవారు గో సంగులనియె యూహింపవలసియుండును.  ఎన్నివిధములుగా నాలోచించినను బ్రహ్మనాయుడే నానాజాతినాయకుల నొక్కచోటికి జేర్చి రెడ్లతో ప్రతిఘటించి పోరాడినవాడు. వాని తరువాతనె పద్మనాయకులు కాకతీయులను గొల్చుచు గణపతిచక్రవర్తి రుద్రమదేవి ప్రతాపరుద్ర చక్రవర్తి మొదలగువారి పాలనములో గొప్ప పదవులను వహించి కాకతీయ రాజ్య సంరక్షకులై యెప్పిరి.  ఈపద్మ నాయకులలో గొందరు "బిరుదు నాయకురాలి రణరంగ రాఘవ త్రాణ సహప్రబాహా!" యను బిరుదును వహించిన వా రుండుటచేత వీరలు బ్రహ్మనాయని కాలములో నాయకత్వమును బొందినవా రనుటకు సందియము కలుగరాదు. పద్మనాయకులలో గొందఱు "వాలు చెవులును వ్రేలుగడ్డమును కుమరకుం గొండవారికె గల రెడ్డినాయకచ్చాన్లూ, గండి చెర్వుకట్టయెక్కి చెడ్డ మల్లంచు గనిని దూరే రెడ్దినాయకచ్చామ్లా" మొదలగు బిరుదులను వహిచినవా రగుటచేత రెడ్లకు బ్రబలవైరులుగ నుండి రని వేద్య మగుచున్నది.  బ్రహ్మనాయని యన్న