పుట:Andhrula Charitramu Part 2.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గొన్ని వాక్యములు గానంబడుచున్నవి. బ్రహ్మనాయనికొడుకైన బాలచంద్రుడు తనమిత్రుడైన అనపోతు అనెడి బ్రాహ్మణుని తనతో గూడ యుద్ధమునకు గొనిపొక మర్మము పెట్టి యాతని నింటికి పంపినప్పు డాతడు బాలచంద్రుని కార్యమును గర్హించి యీక్రిందిరీతిని జెంతించుచ్ పౌరుషముచే నాత్మహత్య గావించుకొని ప్రాణంబులు విదిచెను.

     "నెంలినైతిని వెలమలవద్ద
      గలిమి కోసము వచ్చి కలియుట లేదు
      కులమున గొద నని కూడుట లెదు
      తల్లిని తండ్రిని దాయాదిజనుల
      నెడ బాసినీ పొందు నేనమ్మియుంటి
      బగవాడ నైతిని బాంధవతతికి
      బాసి పోదగు నయ్య బ్రహ్మన్నతనయ"

     పల్నాటి భూమిపతులు గూడగొల్ల సవతి తల్లుల బిడ్డ అని స్పష్టముగ "క్రీడాభిరామ" మను గ్రంధమున నీ క్రింది పద్యములో నాకొనబడి యున్నది.

"సీ. ఇచ్చోట భుయించి రేకకార్యస్థులై
      సామంతనృపతులు చాపకూడు
      ఇచ్చోట జింతించె నిచ్చ నుపాయంబు
      వలినాక్షి యార్వెల్లి నాయిరాలు
      నిజ మను కుర్ధికై నిప్పుల యేటిలో
      నోలాడె నిచ్చోట లీలసాని
      యిచ్చోట బోరరి యిల పణంబుగ గొల్ల
      సవతితల్లులబిడ్ద లవనిపతులు
      ధీరులగు వార లేవురు వీరపురుషు
      లె మదోద్ధతి నిచ్చోట నాజింబడిరి