పుట:Andhrula Charitramu Part 2.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రకటించిన గ్రంధములందును పద్మనాయకు లొకప్పుడు క్షత్రియకులము వారు గానే యుండి తరువాత శూద్రు లయి పోయి రనియు తక్కిన శూద్రజాతులవారి కెవ్వరికి క్షత్రియనాచమము వర్తింప దనియు వ్రాయబడియున్నది. ఇది యెంత మాత్రమును విశ్వసింప దగినది కాదు. ఆంధ్రదేశములో క్షత్రియుల మనిపించు కొనుచున్న రాచవారి యొక్క పూర్వులు సయితము వరిశాసనములలో చరుర్ధ కులమువార మని చెప్పుకొనియుండగా బెక్కుతెగలలలో నుండి వచ్చి యేర్పడి యీశాంఅవారు తాము మాత్రము క్షత్రియసంతతివార మనియు దక్కినవారు కారని వ్రాయించుట వింతగా నుండకమానదు. అందువలన వీ ఱొక గొప్పకారణము దెలుపుచున్నారు.

సహపంక్రి భోజనము.

   ఒకప్పుడు ఢిల్లీచక్రవర్తి దండెత్తివచ్చి విశేషసైన్యములతో నోరుగల్లు ముట్టడించి నప్పుడు కమ్మసేనానులు చాలాకాలము పోరాడి యోడిపోయిరనియు, తరువాత పద్మనాయకుం లనంబడెడు నీ వెలమవారు ప్రతాపరుద్రినితో "స్వామీ మేము దేవరకుగా ప్రాణములు సమర్పింప సిద్ధముగా నున్నాము మేము జీవించి యుండగా బరరాష్రులు కోటలో గాలిడరు.  మేము విజయమునంది వచ్చితి మేని తమతో సహపంక్తియును సమానప్రతిపత్తియును నీయవేడెద" మని చెప్పగా నత డందునకు సమ్మతించె నట! అపుడు ప్రతాపరుద్రుడు వాగ్ధానము ప్రకారము వెలమవారియెడ మిక్కిలి కృతజ్ఞ డై వారలకు సహపంక్తి యొసంగి గౌరవించె నట! మొదట కాకతీయులు కులముచేత క్షత్రియు లయినప్పుడు గదా యిట్టికార్యము యొక్క ఘనత

కాకతీయులు చతుర్ధకులజులు.

వెల్లడి యగుట కనువై! యుండును? కాకతీయులు క్షత్రియకులమువారు కారని యు, చరుర్ధకులజులే యనియు ఇటీవల దొరకిన రెండుశాసనములలో