పుట:Andhrula Charitramu Part 2.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"గీ. తారకలలోన గ్రహరాజు వేఱెయైన
     భాతి దశవిధ వెలమల బాయ ద్రోచి
     సప్తసప్తతి పద్మజనముదయంబు
    పద్మనాయకు లనగను బ్రబలె జగతి."

     అని పొగడి యున్నాడు.  విష్ణువు పాదపద్మమునందు జనించుట చేతనె వీరికి పద్మజులను పేరు గలిగిన దనియు, అందివలననే అద్మనాయకు లను నామము వహించి రనియు జెప్పుట సయిక్తికముగా గనుపట్టదు ఎందుకన విష్ణుపాదోద్భవసంభవుల మని పంటరెడ్లు, కమ్మవారు, మొదలగు తెగలవా రెల్లరును జెప్పుకొనియున్నావా రయినను వారలకు పద్మనాయకులను పేరు గ్రంధములను వినంబడదు.  శ్రీనాధకవి తనభీమఖండమునందు వెలమల గమ్మలు ఒంటరులు మొదలగు వారేల నెల్లరను బద్మనాయకు లని చెప్పినట్లు గా నాకడ నున్న ముద్రితప్రతిలో నున్నది.  అయినను రావువంశ్రీయ చరిత్రము లో కీర్తిశేషులయిన గురుజాడ శ్రీరామమూర్తిపంతులుగారు పద్మనాయకులను వెలమలను వేర్వేఱు తెగలవారినిగ శ్రీనాధకవి పేర్కొనియెనని వ్రాసియున్నారు. అట్లయిన యెడల పద్మవెలమలకు పద్మనాయకులను నామము గలుగుతకు వేఱు కారణ ముండవలయు నని గనుపట్టకమానదు.  ఎంత మందబుద్ధుల కైనను పద్మనాయకుల మన్నతోడనే పద్ముడనువాడు నాయకుడుగా గలిగిన సమూహ మని యర్ధము గాక మానదు.  అందువలన వేర్వేఱు తెగలనుండి యేకారణముచేతనో వేఱుపడి వచ్చి ప్రత్యేకముగా నొకతెగవా రయి రని తెలుపు టకు అద్మనాఅక కులమనునదే సాక్ష్యముగ నున్నది.  అందులకు గ్రంధముల నాధారము లేవైన గలవా యని పరిశీలించినచో గొంతవఱకు గన్పట్టక మానవు.
   పద్మనాయకులయొక్క పూర్వు లెవ్వరును తాము క్షత్రియకులమువారని చెప్పికొని యుండలేదు.  పద్మనాయకులలో సుప్రసిద్దులయిన రేచెర్ల వారు చతుర్ధవర్ణమునందు జనించివార మని స్పష్టముగ దెలుపుకొనియుండ శద్వంశజులయిన వెలుగోటివారు ప్రకటింపించిన గ్రంధములందును రావువారు