Jump to content

పుట:Andhrula Charitramu Part 2.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పద్మనాయక చరిత్రములో నుదాహరింపబడిన పైపద్యములను బట్టి కొంకణాది దేశములనుండి వచ్చిన కుంభినులు మొదలగు వారిని తక్కిన తెగల వారలు వెలమలుగ భావించి తమకన్న దక్కువగ జూచుచున్నటులను వారలు శూద్రులు గాక పోయినను ప్రతాపరుద్రక్షితిపాలునిచే గౌరవింపబడి రనియు వెలమ వారిలోను కమ్మవారిలోను గూడ నూత్నరక్తము ప్రవహించుచుండె ననియు భావము సూచింపబడుచున్నది గదా. అప్పటికి వాడుకలోనుండు గాధలను బురస్కరించుకొని పద్మనాయకచరిత్రకారుడట్లు వ్రాసియుండు ననుటకు సందియము లెదు. మఱియు నాతడు స్వరచనవ్యాఘాతము గా నాగ్రంధము ననే మఱి యొక చోట

"క. తొలి కాల ముర్వి గొడవల
     వెలియై యాలములయందు విహరించుటచే
     నిల కాపుజనులు గొందఱు
     వెలమ లనన్ జగతిలోని నిశ్రుతు లగుటన్."
     అనియు వ్రాసియుండెను. అంతటితో దృప్తినొందక,
"క. పద్మం బోలెడు పద్మకు
     పద్మగతి న్నాయకాఖ్య సరణీదలిర్నన్
     పద్మ రమాతరుణీ ముఖ
     పద్మమునం బొలుచు లక్ష్య భావ మనంగన్."
"గీ.దైత్యవిధ్వంసి పాదపద్మజు లటంచు
    వేదములు పల్కు గావున విదితముగను
    శూద్రకులజులు నౌట సంసూచితముగ
    బద్మజఖ్యాతి నియమించి పలికి రపుడు."

   అని విష్ణువుయొక్క పాదపద్మమునందు జనించుటచేత బద్మజులను సంజ్ఞ కలిగి నటుల నుడివెను. అదియునుం గాక తక్కిన వెలమ తగలవారిని గ్రిందప ఱుచుచు పద్మనాయకుల నధికు లని చెప్పి