పుట:Andhrula Charitramu Part 2.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెను ఇతడు గణపతిదేవచక్రవర్తికి సామంతుడై అద్దంకిసీమను బరిపాలనము సేయుచు విక్రమసింహ పురాధిపతీయైన మనుమసిద్ధిరాజుతోడ యుద్ధములు సేయుచుండెను. ఒకయుద్ధములో నితని మనుమసిద్ధిరాజు జయించినట్లు గా దిక్కన కవిసార్వభౌముడు తన నిర్ఫచనోత్తర రామాయణ పీఠికలో వ్రాసియున్న వివరమును రెండవ ప్రకరణమునం దెలిపియున్నాను. ఇతడును తనతండ్రియైన మాధవదేవరాజు వహించిన "అతివిషమహయారూఢ ప్రౌఢరేఖారేవంతుండు, సరబల కృతాంతుడు, శరణాగత వజ్రపంజరుడు, మండలీకర నందోళియు, జీవరక్ష చక్రనారాయణుడు నను బిరుదముల నన్నిటిని వహించెను. ఇతనికి గోవింద్ నాయకుడు మంత్రిగ నుండెను. ఈసారంగధరుడు బ్రాహ్మణపక్షపాతియు, బ్రాహ్మణభక్తుడునై యుండెను. ఇతడు సారంగపురమును నగ్రహారమును గల్పించి 47 భాగములుగ విభాగించి వివిధ గోత్రులయిన బ్రాహ్మణులకు భక్తివిశ్వాసపూర్వకముగా ధారాదత్తము చేసి తామ్రశాసనము వ్రాయించి యిప్పించెను.

                     --------