పుట:Andhrula Charitramu Part 2.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అద్దంకి ప్రభువు మాధవ నాయకుడు.

    చోడ చక్రవర్తుల పరిపాలనమునం దెప్పుడో మహారాష్ట్ర సేవణ దేశమునుండి వచ్చిన నాయకుల్ గొంద అద్దంకి సీమకు నధికరులుగ నేర్పడిరి. సేవణరాజులు యాదవులగుటం జేసి వీనిరి గూడ యాదవులను గానే భావింపవలసిలయున్నది  ఈప్రభువుల గుటం జేసి గూడ యాదవులను గానే భావింపవలసియున్నది.  ఈప్రభువుల శాసనములు క్రీ.శ.1210 దవ సంవత్సరము మొదలుకొని క్రీ.శ.1275 దవ సంవత్సరమువఱకు నద్దంకి సీమలో గానంబడుచున్నవి.  గణపతిదేవ చక్రవర్తికాలమున  సీమకధిపతియై పరిపాలనము సేయుచున్నవాడు  శ్రీమన్మహామండలేశ్వర మాధవమహారాజుగా నుండెను.  అతివిషమహయారూఢ ప్రౌఢరేఖా రేవంతుడనియు, పరబలకృతాంతుడనియు, శరణాగతివజ్రపంజరు డనియు, మండలీకరవం దోలి యనియు, జీవరక్షచక్రనారాయణుం డనియు బిరుదములను బొందినవాడుగా నుండెను.  ఇతడు శా.శ.1130 విభిసంవత్సర్ భధ్రపద శుక్లపక్ష దశమీ సోమవారమునాడు సంక్రాంతి సమయమున శ్రీమాండులేశ్వర మహాదేవునకు గండ్రకమ్మకు బడమట నున్న కొటికలపూడి గ్రామమున నలువది పుట్ల పొలము దానము చేసె నని వంగపోలు తాలూకాలోని మణికేశ్వర గ్రామములోనున్న పాండుకేశ్వర దేవాలయుమున కెదుటనున్న ఱాతిపైవ్రాయబడిన శాసనమును బట్టి దెలియుచున్నది.1 కనుక నితడు క్రీ.శ. 1208 దవ సంవత్సర ప్రాంతమున నద్దంకిసీమను బరిపాలనము సేయుచుండె ననుట యధార్ధమని స్పష్టపడుచున్నది.
    ఇరువది ముప్పది సంవత్సరములకుబిమ్మట వ్రాయబడిన శాసనములలో నీతడు కాకతి గణపతిదేవ చక్రవర్తికి సామంతుడై యున్నటుల వ్రాయబడి యుండుటం యీనడుమకాలమున నెప్పుడో కాకతి గణపతిచే జయింపబడి యాతనికి సామంతుడై యుండెనని నిశ్చయింపక తప్పుదు. కాబట్టి

1.Nellore Inscriptions. Vol. III. Ongole No.76.