పుట:Andhrula Charitramu Part 2.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

డైనందున గంగయసాహిణికి మాండలిక బ్రహ్మరాక్షసుడనియు, రక్కెసగంగనియు బేరులు వచ్చెను. ఆకాలమునం దాంధ్రచక్రవర్తియైన గణపతిదేవుని రాష్ట్రంబున డెబ్బదిరెండు వినియోగంబులవారు గలరు. వారి కెల్లరకు నీతండధిపతి గావున బాహత్తరి నియోగాధిపతి యని బిరుదమ్న్ వహించెను. అయ్యలరాజు నారాయాణామాత్య విరచితమైన హంసవింశతి యను ప్రబంధమునందు:-

     "గురు మహాప్రధాన సామంత సేనాపతి ద్వారపాల కానసరిక ఘటికా నిర్ధారక గణక లేఖక పౌరాణిక పురోహిత జౌతిషిక కార్యజవిద్వాంసక దేవతార్చక మూలాకారక పరిమళకారక చేష్టాధికార గజాధికా రాశ్వాధికార భాండాగారాధికారి ధాన్యాధికా రాంగరక్షక సూతమాద బేతాళేమత తాంబూలికతాళనృంత: నరఫాహన చ్చాత్త్రిక దామరిక కళాంబిక శరశారిక కీరమాలిక పాదుకాధార నర్తక  గాయక వైణిక శాకునిక మాగధవైతాళిక స్తుతిపాశక పరిహాసశ క్షౌరిక రజక సౌచిక చర్మకారక ముద్రాధికార పురపాలక గజవైద్యాశ్వవైర్య పశువైద్య భేరీవాదక ముగిజవాదక కారిక కుంభకారక చిత్రకారక వ్యావహారిక మృగయాది పక్షివాహక ఫణీవహక కోగ్రాణాధికార నైశ్యజనంబు" లాదిగా దెబ్బెదిరెండు వినియోగంబుల వాని పేర్కొని యున్నాడు.
             గంగయ సాహిణి దానధర్మములు.
   గంగయసాహిణి చేసిన దానధర్మములను గూర్చి శాసనముల నేకములు కడప కందవోలు మందలములలో ననేకములు గావచ్చును. ఆకాలమునాటి ప్రభులవలెనె దేవతా బ్రాహ్మణ భక్తిగలవాడగుటచేత నితడనేక శివాలయముల కున్ను బ్రాహ్మణులకును దానధర్మములను గావించిప్రఖ్యాతుడయ్యెను. ఇతడు శా.శ.1177 (క్రీ.శ.1255) రాక్షసనామసంవత్సర శ్రావణ శుద్ధ 15 మంగళవారము నాడు చంద్రగ్రహణ పుణ్యకాలమున త్రిపురాంతకములోని త్రిపురాంతకేశ్వరునకు మోడివాడిగాడిలోని పూలచెరువు గ్రామ