పుట:Andhrula Charitramu Part 2.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"ఇట్టి మహాపరాక్రమవంతుడైన గంగయసాహిణి నొకమండలాధిపతిగ నున్న మనుమసిద్ధి యెట్లు జయించి యతని రాజ్యాంగము లెల్ల నాచికొని యెనో, ఎట్లాత డాశ్రితుడై యితనిం బ్రార్దించెనో, ఎట్లీత డాశ్రితవత్సలవృత్తి యేర్పదునట్లుగా నాచికొన్న రాజ్యాంగములెల్ల నిచ్చి పదముగైకోనంబచెనో, ఎంతమాత్రమును బొధపడకున్నది." అని యీచరిత్రము యొక్క రెండవ ప్రకరణములో మనుమసిద్ధిరాజులగూర్చిన ఘట్టమున వ్రాసియున్నాను. ఇటీవల స్థానిక చరిత్రములం బరిశోధింపగా గంగయసాహిణియొక్క పూర్వవృత్తాంతము గొంతవఱకు దెలియవచ్చినది. గంగయసాహిణి మొట్టమొదట గనపతిదేవ చక్రవర్తి కొలువులో లేడనియు మనుమసిద్ధిరాజు తండ్రియైన తిరుకాళచోడమహారాజునకు (తిక్కరాజు) అగ్రసేనాధిపతిగ నుండెననియు, సిద్ధవటముసీమలోని యొగూరు స్థానిక చరిత్రమునందు జెప్పబడుచున్నది. ఇతడు మొదట తిక్కభూపాలునకు సేనాధిపతిగ నుండి యతని యనంతరమున కలుకడపురవరాధీశ్వరుం డయిన శ్రీమన్మహామండలేశ్వర త్త్రైలోక్యముమల్ల భుజబల వీరనారాయణ రాయ దేవమహాదేవరాయల సైన్యాధీశుడై మోదుకూరునందుండి ములికినాటిని బరిపాలనము సేయునపుడు తిక్కరాజు కొడుకయిన మనుమసిద్ధిరాజునకును గంగయసాహిణికిని, యుద్ధము జరిగి యుండవచ్చును. ఆయుద్ధమునందు గంగయసాహిణి నోడించి యతం డాశ్రయించుటచేత దనయాశ్రితవత్సలవృత్తి యేర్పడినట్లుగా యధాస్థానమునం దుంచెనని స్పష్టమగుచున్నది. శా.శ.1162 (క్రీ.శ.1247) ప్లవంగ సంవత్సర పుష్యశుద్ధ 13 బుధవారమునాడు గంగయదేవ మహారాజునకు భృత్యుడైన జొత్తిరామనాయకుడు ములికినాటిసీమలోని సిద్ధవటము నకు బశ్చిమమున రెందుపరువుల దూరమున బినాకినీనదీ తీరమున నున్న జ్యుఓతిగ్రామములోని సిద్ధనాధుని గుడిగోపురము కట్టించి యగ్రహారము నొసంగి శాసనము వ్రాయించెను. కాబట్టి క్రీ.శ. 1247 వ సంవత్సరమున గాని తరువాత గాని కాకతి గణపతిదేవచక్రవర్తి దక్షిణదేశమునకు దండేత్తివచ్చుట సంభవించియుండును.