పుట:Andhrula Charitramu Part 2.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెను. వడ్లకూరుగ్రామమున భీమేశ్వరాలయము నిర్మించి భీమసముద్రమను తటాకమును ద్రవించెను. ఇతని ధైర్యసాహసపరాక్రమములను మెచ్చుకొని చోడమహారాజు తలగడదీవి మొదలగు గ్రామముల కాధిపత్యము నొసంగుటయే గాక యితని సామర్ధ్య మెఱింగినవా డగుటచేత దనకుసైన్యాధ్యక్షునిగ జెసికొనియెను. ఈసైన్యాధ్యక్షు డయిన నారపనాయకునకు చోడినాయకుడు, భీమనాయకుడు, పిన్నచోడినాయకుడు, బ్రహ్మనాయకుడు నను నలువురు పుత్రులు జనించి వెలనాటిచోడరాజునకు సేనాధిపతులై చతుస్సముద్రముల వలెనుండి దేశమును శత్రుబాధనుండి సంరక్షించుచుండిరి. వీరిలో మూడవవా డయిన పిన్నచోడుఇనకు దామాంబ(రామమ్మ) వలన నరాంబ (నారమ్మ), పేరమాంబ (పేరమ్మ) యను కూతులును; పృధ్వినాయుడు, జయపనాయుడు, నరపనాయుడు (నారాయణుడు), నను పుత్రులును జనించిరి. అంత గొంత కాలమునకు గణపతిదేవమహారాజు నేవణ కర్ణాట లాట కళింగ చోళధరాధిపులను జయించి వెలనాటిపై దండెత్తివచ్చి వెలనాటిని జయించి యీప్రసిద్ధ మైన ద్వీపముతో గూడ నాక్తమించుకొనియెను. వెలనాటిలో దొరికిన దృడలాయులను, ఏనుఇగులను, గుఱ్ఱములను నానావిధము లయిన రత్నములను ధనకనకవస్తు వాహనాదులను జూఱగొనియెను. ఇంతియగాక పిన్నచోడుని కూతులయిన నరాంబను పేరాంబను బెండ్లియాడ యాసుందరీమణుల ద్వితీ;యసొదరు డైన జయపనాయకుని బుద్ధివిశేషమునున్, ధైర్యసాహసములును, పౌరుష పరాక్రమములును, గుణసంపదయును తన్ను నాకర్షింపగా సంతోషించి తన గజ సైన్యమున కధిపుని గావించి బిరుదముల నొసంగి యున్నతమైన పదవికి గొని వచ్చెను. అందువలన జయపనాయకుని యెదుట శత్రువులు తలయెత్తిచూచు టకు భయపడుచుండిరి. గణపతిదేవచక్రవర్తి బాహుదర్పముచేతనేగాక, రాజనీతి వేత్తయైనప్రతిభాశాలియునై యుండినందువలన, రాజ్యమును విస్తరింపజేసి చక్ర వర్తియగుట తటస్థించెను. జయపనాయకుడు శాత్రవులను నిర్జించుటచేత వైరిగొ ధూమ ఘరట్టా మను బిరుదమును పొంది విఖ్యాతి గాంచెను. ఇతడు