పుట:Andhrula Charitramu Part 2.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తండ్రివంకచుట్టాలు, వియ్యాలవారు నగుటచేత గణపతిదేవమహారాజు వారల సాయముతో వెలనాటి నవలీలగా జయింప గలిగెను. వెలనాటిని జయించుటతో మాత్రము తృప్తిచెందక వెలనాటిసైన్యాధిపతులతో బాంధవ్యమును నెఱపి యాభాగమున దనపాలనము దృఢముగ నాటుకొనునట్లు గావించెను. ఇతడు వెలనాటికి రాజధాని యైన ధనదుపురమునందలి యైశ్వర్యమునంతను జూఱగొని యేకశిలానగరమునకు జేర్చుటయేగాక ప్రఖ్యాతిగాంచిన వీరపురుషులకెల్లరకు నుద్యోగము లొసంగి యాదరించెను. శాత్రవులకు దక్క మఱియెవ్వరికి నొత్తుడుకలుగనీయనందున నీతనిపరిపాలనము వెలనాటిప్రజల కనుకూలముగ నుండెను. వెలనాటిని జయించిన స్వల్పకాలములోనే యాభారమునందంతట శాంతిని నెక్కొలిపి మఱియెన్నటికి దిరుగబడకుండునట్లు చక్కని యేర్పాటులను గావించెను.

         గజసాహిణి జయపనాయకుని సంబంధము.
   అయ్యవంశమున జనించిన భామయ్య యను కమ్మనాయకు డొకండు వెలనాటిలోని క్రొయ్యూరునందు నివసించి యుండెను. ఆభీమనాయకునకు రాజాంబికవలన జల్లయ, నారయ, సూరయ, అను మూవురుపుత్రులు జనించి వెలనాటిచోడమహారాజుకొలువున నుద్యోగములను వహించి యుండిరి. వారిలో జల్లయ యొకానొక కన్నరిదేవుని యుద్ధములో జయించినందున సేనాధి పత్యము బడసెను. రెండవవాడయిన నారిపనాయకుడు (నారాయణ) చోడరాజు యొక్క ప్రేరణముచేత గృష్ణానది సాగరగామి యగుచోట నేర్పడియున్న ద్వీపము నిర్జనభూమియై యుండ నందొక కోటను గట్టి ప్రాకారములు, రాజమందిరములు, విశాలభవనములు, మిద్దెలు, మేడలు నిర్మించి, తోటలను వేయించి, యొక మహాపట్టణముగజేసి, తనప్రభువుపేర చోడసముద్ర మను నొక తటాకము ద్రవ్వించి, చోడేశ్వరాలయమును నిర్మించి, జననివాసయోగ్య మైన పుణ్యభూమిగ జెసి ప్రసిద్ధి గాంచెను. మఱియు నచ్చోట నొకవిష్ణ్వాలయమును, కరాళబైరవాలమును నిర్మింపిం