పుట:Andhrula Charitramu Part 2.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్దమునందు గృష్ణాగోదావరి నదులకు నడుమనుండు దేశమును బరిపాలించిరి. కాకతిగణపతిదేవుని రాజ్యారంభకాలమున శ్రీమన్మహామాండలిక కేశవదేవరాజు, వానిపుత్రుడు సామినాయకుడును, ఏలూరు (కొలనుపురము) రాజధానిక నీమండలమును బరిపాలనము సేయుచుండిరి. కేశవనాయకుడును వాని కుమారుడును, వెలనాటిప్రభువుల యధికారము క్షీణించుకాలమున స్వతంత్రులుగ బరిపాలనము చేసిరి. కేశవనాయకుని దానశాసనములనేకములు కొలను (ఏలూరు) పురమున గానంబడుచున్నవి. క్రీ.శ.1228 దవ సంవత్సరము నాటికి నీమండలమంతయును కాకతీయగణపతిదేవచక్రవర్తిచే జయింపబడెను. తెలుగునాటిరెడ్లకు తెలుగాలని పేరు గలిగినది. చాళుక్యులు తెలుగుదేశముపై దండెత్తివచ్చి జయించినప్పుడు వారితోవచ్చిన సేనలు సేనాధిఅతులు మొదట్ కమ్మనాటిలో వసించుచుండి తరువాత నితరస్థలములకుబోవ బ్రజలు క్రొత్తవారికిని ప్రాతవారికిని భేదము దెలియుటకై కమ్మనాటినాయకులను కమ్మవారనియు, అరివఱ కీతెలుగుదేశమున నున్న తెలుంగునాయకులను తెలగా లనియు వ్యవహరింపసాగిరి. నాటినుండియు గమ్మవారును, తెలగాలును వేర్వేఱుతెగవారుగా నుండుట తటస్థమైనది. కాని క్రీస్తుశతాబ్ధారంభమున నాంధ్ర సామ్రాజ్యూవిజృంభణకాలమున వీరును వారు నొక్కరుగనె యుండిరి.

     ఈ మాండలిక కేశవరాజునకును వాణీఇకుమారునకును, అనంతప్రెగ్గడయు, వానికుమారుడుమల్లాప్రగ్గడయు మంత్రులుగా నుండిరి.  ఈ మల్లాప్రెగ్గడ సుప్రసిద్ధుడగుటచేత నతనిసంతతివారికి మల్లాప్రెగడవారని యింటిపేరు కలిగినది.
                          గణపతిదేవుడు వెలనాటిని జయించుట.
      కాకతిగణపతిదేవచక్రవర్తి క్రీ.శ.1228 దవ సంవత్సరమునాటికి వెలనాటి దేశమును సంపూర్ణముగా జయించెను. నకవాటిసీమరాజులు ధరణికోట రాజులు, క్రొన్నతనాటిరాజులు, గుడిమెట్టరాజులును, తల్లివంక చుట్టాలు,