పుట:Andhrula Charitramu Part 2.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దేశమును వశపఱచుకొనవలయు నని భగీరధప్రయత్నములు గావించిరిగాని తెలుంగువారిపరాక్రమము ముందట నవియన్నియు భగ్నములై పోయినవి. గణపతిదేవుడు సింహాసన మెక్కినతోడనే మండలేశ్వరు లనేకులచే బరిపాలింప బడుచున్న యాంధ్రదేశమునంతయు నేకచ్చత్రముక్రిందికి దీసికొని గావలయు నని నిశ్చయించి తదునుగుణముగా సమర్ధులయిన మంత్రులను సేనాధిపతు లను నియమించుకొని వారలసాహాయ్యముతో విజయయాత్రలు ప్రారంభించి యొక్కక్కమండలేశ్వరుని జయించి వశపఱచుకొని సామంతునిగ జేసికొనుచుండెను. గనపతిదేవుడు రాజ్యూతంత్రజ్ఞానముగలవాడు గావున నేపని ప్రారంభించినను అతనికి విజయమే సమకూఱుచుండెను. కృష్ణానది మొదలుకొని కాంచీపురమువఱకు గల తూర్పుతీరమునంతయు గమ్మనాటిరెడ్లు, పాకనాటి రెడ్లు, రేనాటిరెడ్లు, చోడు లను పేరితో బరిపాలనముచేయుచు బేరికిమాత్రము కాంచీపురచోడచక్రవర్తులకు సామంతులమని చెప్పుకొనుచు నైకమత్యములేక తమలో దాము పోరాడుచుండ గా గణపతి దేవమహారాజు వారల నందఱను జయించి యేకసామ్రాజ్యమునకు లోబడిన వారినిగజేసి దేశమున సద్ధర్మపరి పాలనము నెలకొల్పవలయు నని తన యావచ్చక్తిని వినియోగించి తుదకు గృతార్ధుడై శాశ్వతమైన కీర్తిని గడించెను.

                       వేంగీదేశములోని కల్లోలములు.
     వెలనాటిభూపతులు పేరికిమాత్రము చాళుక్యచోడచక్రవార్తులకు బ్రతినిధిలై విక్రమసింహపురమను నెల్లూరు మొదలుకొని యుత్తరమున సింహాచల పర్యంతమును గల వేంగీదేశమునంతయు ననేకమండలాధిపతుల సాహాయ్య ముతో నిరంకుశముగ బరిపాలనము సేయుచుండ బండ్రెండవశతాబ్దాంతమున గొప్పకలవరము జనించి చాళుక్యూచోడచక్రవ్ర్తుల యధికారమంతయు సంపూర్ణముగా క్షీణిచుటయె గాక వెలనాటిరాజులలో గడపదివాడయిన పృధ్వీశ్వరునితోగూడ వెలనాటి సామ్రాజ్యలక్షి కాకతీయులను శరణు చొచ్చెను. పండ్రెండవశతాబ్దాంతమున పృధ్వీశ్వరమహారాజునకును విక్రమ