పుట:Andhrula Charitramu Part 2.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాకతిగణపతిదేవచక్రవర్తి పాలనము.

(క్రీ.శ. 1199 మొదలుకొని క్రీ.శ.12670 వఱకు.)

      శౌణదేశాధీశ్వరుం డయినకాకతిమహాదేవరాజునకును జరిగిన మహా యుద్ధములోమహాదేవరాజునకును జరిగిన మహాయుద్ధములో మహాదేవరాజు వీరమరణము నొందినవెనుక నతని కుమారుడు డైన గణపతిదేవుడు సింహాసనా రూఢుడయ్యెను. ఇతడు మహాదేవరాజునకు బయ్యాంబికవలన జనియించినవాడు.1 ఇతడు తన పెదతండ్రి యైనప్రతాపరుద్రదేవునిచే స్థాపింపబ

డిన త్రైలింగ్యసామ్రాజ్యమును నాలడల విస్తరింప జేసి చక్రఫర్తిపదమునువహించి సప్తమచక్రవర్తి యని యాంధ్రభూస్థలినంతట్ వేనోళ్ల గొనియాడబడుచుండెను. పైని జెప్పిన యుద్ధములో నితడు శాత్రవులచే జిక్కువడి విడిచిపట్టబడిన తరువాత ఆయవమానమును భరింపజాలక అసంఖ్యాకములయిన సైన్యములంగూర్చుకొని యాదేశముపై దాడి వెడలి యూదవులతో యుద్ధము చేసి శౌణభూపతిని జయించి యితనివ్లన నమూల్యములయిన రత్న రాసులను ధనమును బడసి నిజరాజధానికి మరలివచ్చెను. అప్పటినుండియు యాదవు ల నేకపర్యాయము లాంధ్రదేశ మాక్రమించు కొనుటకై ప్రబకయత్నములు చేయుచువచ్చిరిగాని తెలుంగువారు వారిని గోదా వరినదినిదాటి దిగువకు రానీక నిలిపిరి. పశ్చిమఛాళుక్యసామ్రాజ్య మంతరించి న వెనుక కర్ణాటకదేశమున కధిపతులైన భళ్లాణరాజులు సయితము త్రిలింగ


 1.పూర్వగ్రంధములలో గణపతి మొదటిప్రతాపరుద్రుకొడుకని వ్రాయుటెందుకు గాని సరిగాదు.  శాసనములలో గణపతి మహాదేవరాజు కొడుకని స్పష్టముగ జెప్పబడియెను.