పుట:Andhrula Charitramu Part 2.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బూర్వము నేత్రపాటివిషయ మనుపేరితొ బరగుచుండి తూర్పున నేలూరివరకు సమీపముగా నున్న దెందులూరువఱకును విస్తరించి యుండెను. విష్ణుకుండిన వంశరాజుం డయిన విక్రమేంద్రవర్మశాసనములలో నొకదానియం దీసీమ యుదాహరింఫబదినది.1 దుర్జయవంశరాజుల మనియు, చతుర్ధాన్వయుల మని యు జెపుకొనిన రాజు లీనతవాటిసీమను మొదటిప్రతాపరుద్రునికాలమున బరిపాలించుచుండిరి. అప్పు డీమండలమును హ్బరిపాలించుచున్నవాడు కాక తీయూలకు బంధు వగ్తు దుర్గరాజుకొడుకు బుద్ధరాజు. పండ్రెండవశతాభ్ధాంతమున మహమండలేశ్వరు డైన బుద్ధరాజకుమారుడు రుద్రరాజు మడపల్లె రాజధానిగ నతవాటిసీమను బరిపాలనము సేయుచుండెను.

                  బుద్ధరాజుకొడుకు రుద్రరాజు.
   శ్రీమన్మహామండలేశ్వర రుద్రదేవరాజు కాకతిప్రోలరాజుయొక్క పుత్రులలో నొక్కండును, మొదటిప్రతాపరుద్రుని తమ్ముడ్ను, గణపతిదేవచక్రవర్తియొక్క తండ్రియు నగు మహాదేవరాజుయొక్క పుత్రిక యగు మేలమాంబికను (మైలమ్మ) వివాహముజేసికొనియె నని త్రిపురాంతకములోని మేళమాంబిక శాస్దనమువలన దెలియుచున్నది.2 రుద్రరాజునకు మెళాంబికవలన్ నెనమండ్రు కుమారులును బయ్యలమహాదేవి యను కొమార్తయు గలిగినట్లుగా ధాన్యకటకములో నమరేశ్వరదేవాలయములోని బయ్యలమహాదేవియెక్క దాన శాసనములో స్పష్టముగా చెప్పబదినది.3 ఈమె బుద్ధదేవునికి దానముచేసిన ట్లిదివఱకే  వ్రాసియున్నాను. బయ్యలదేవి తండ్రియైన యీరుద్రదేవరాజు బుద్ధరాజునకు ద్వితీయపుత్రుడని త్రిపురాంతకశాసనములో జెప్పబడినది. ఈ నతవాటిసీమరాజులు మొదట చాళుక్యచోడచక్రవర్తులకు సామంతులుగానుండి తరువత కాకతీయులతోడి సంబంధబాంధవ్యములచేత గణపతిదేవచక్రవర్తి కాలమున నాతనికి సామంతులైరి. బందరుజిల్లా

(1) ఆంధ్రులచరిత్ర రా.గ. వే. 363 (2) No.204 of the Epigraphical Collection for 1905 (3) No.15. B. Two Pillar Inscriptions at Amaravaty.