పుట:Andhrula Charitramu Part 2.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చోడుడీ వేంగీదేశరాజప్రతినిధియై యాంధ్రదేశములోని వేంగీభాగమును బరిపాలించెను. గుంటూరుమండలములోని సిరిపురశాసనమున నితనిగూర్చి యీ క్రిందిపద్యము చెప్పబదినది.

"చం. ఇల వెలనాటిగొంకవసుధీశతమాభవు డైనచోడభూ
        తలపతి చోడపట్నము ముదంబున గట్టి భుజాబలంబునం
        గొలని జయించి యందు రిపుకుంజరు భీముని జంపె నాంధ్రభూ
        తలము పదాఱువేలు సతతస్థితినేలె సురేంద్రలీలలన్."

       ఈరాజేంద్రచోడుని మఱదియైన కొండప్డమటిబుద్ధరాజు ధనదుపురము (చందవోలు) లోని పాండీశ్వరదేవాలయమునకు నాడెండ్లలోని కొంతభూమిని దానము చేసెను. మొదటికులోత్తుంగచోడచక్రవర్రియొక్క్ సైన్యాధిపతియు, మొదటిగొంకరాజుయొక్క సోదరుడునైన పండయరాజుచే నిర్మింపబడినదిగావున నాయాలయమునకు పాండేశ్వరాలయ మని పేరు కలిగెను. ఈకొందపడమటి రాజులు వాదెండ్లలోని మూలస్థానేశ్వరదేవాలయమునకు గావించిన దానములను గూర్చిన శాసనము లాదేవాలయముననేకములు గలవు. వీరివంశమున జనించిన జయాంబిక వెలనాటిప్రభు, వైన మూడవకులోత్తుంగచోడగొంకరాజునకు పట్టమహిషియై పృధ్వీశనరేంద్రునకు దల్లియై పిఠాపురమ్యులోని కుంతీమాధవ స్వామి యాలయమును నిర్మించి నవఖండవాడగ్రామమును దానముచేయుట యేగాక సింహాచలములోని నృసింహుని విగ్రహమునకు సువర్ణకవచనమును సమర్పించెను.
                    నతవాటిసీమరాజులు.
       హైదరాబాదు రాష్ట్రములోని మధిరజిల్లా కాకతీయాంధ్రచక్రవర్తుల పరిపాలనకాలమున నతవాటిసీమ యని వ్యవహరింపబడుచుండెను. ఆకాలమున దీనికి మడపల్లెదుర్గమౌ రాజధానిగ నుండెను.1 ఇయ్యది ఛాళుక్యులకు

1. మడపల్లె యనునది ఏలూరికి సమీపమున నున్న మాదేపల్లి యని యొకరు వ్రాసిరి కాని యది సరికాదు. మదుపల్లె బెజవాడహైదరాబాదు రైలు మార్గమున నున్న మధిరస్టేషనునకు సమీపమున నుందు మదపల్లె యనునదియే.