పుట:Andhrula Charitramu Part 2.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

240

ఆంధ్రుల చరిత్రము.


కోట బేతరాజు - కోట గణపాంబ.

మహామండలేశ్వరు డైనకోటకేతరాజునకు రుద్రరాజు జనించెను. ఈ కోట రుద్రరాజుకాలౌననే కాకతీయగణపతిదేవచక్రవర్తి వెలనాటి భూపతులను జయించి సామంతులనుగ జెసికొనెను. ఈదండయాత్రకు బూర్వముననె వెలనాటిపృధ్వీశనరేందునకును, పాకనాటిదేశప్రభువును కాంచీపురచోడచక్రవర్తు లకు సామంతుడగనుండిన మనుమసిద్ధిరాజు తండ్రి యగు తిక్కనృపాలునకును, ఘోతమైన యుద్ధము జరిగి యాయుద్ధమునందు పృధ్వీశనరేంద్రుని మస్తకము తురుమంబడియెను. తరువాత కాకతీయగణపతిదేవచక్రవర్తి యీదేశముపై దండెత్తివచ్చి వెలనాటిప్రభువులను జయించి దేశమునంతయు దనరాజ్యమున జేరుకొనియెను. అప్పుడు మఱియొక యుద్రవము తటస్థింపకుండ నీప్రాంతమున దనరాజ్యము బలపడుటకై తనరెండవ కొమార్త యైన గణపాంబాదేవిని ధరణికోటరాజును మహామండలేశ్వర రుద్రదెవరాజపుత్రుడు నైన మహామండలేశ్వర బెతరాజున కిచ్చి వివాహము గావించెను. రుద్రరాజునకు బిమ్మట బేతరాజు రాజ్యూమును బాలించెను. ఇతడెంతకాలౌ పరిపాలనము చేసెనో తెలిసికొనుట కాధార మేమియును గానరాదు. ఇతడు గణపతిదేవచక్రవర్తి దండ యాత్రలతోగూడ యుద్ధములు చేయు చుండి వయసుమీఱక మున్నే మరణము జెందియుండవలయును. ఇతని మరణానంతరము కోటగణపాంబామహాదేవి చాల కాలము ధరిణికోటయందు బరిపాలనము చేశెంజు. ఈమె దానశాసనములు క్రీస్తు శకము 1274 గవ సంవత్సరములో గనంబడుచుండుటచేత నీమె చాలాకాలము బ్రితికియుండెనని చెప్పవచ్చును. తన యక్కగారైన రుద్రమహాదేవి పరిపాలనము తో గూడ దనపరిపాలనమును సాగించియుండవలయును. భర్తమరణానంతరము గణపాంబ ధర్మకార్యముల ననేకములను గావించెను. ఈమెభర్త స్వర్గస్థు డైన తరువాత ధాన్యకటకములోని యమదేశ్వరాలయముయొక్క గోపురమున సువర్ణ కలశములను నిర్మించెను. ఈమె యొక శివాలయమును నిర్మించి