పుట:Andhrula Charitramu Part 2.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లను గొల్లబోయలకు దనము చేసెను. ఇతని యుంపుడుకత్తెలగు సూరమదేవి యును, ప్రోలమదేవియును గూడబుద్ధుని దీపారాధనముకై నేతికొఱకు బోయలకు గొఱ్ఱెలను దానము చేసిరి. కోటకేతరాజు శైవు డైయుండియు బుద్దోపాసనముచేయు ప్రియురాండ్ర ప్రీతికై సైదానములను జేసి యుండును.

               కెతరాజుయొక్క బ్రాహ్మణాగ్రహారములు.
    తనతల్లి సబమదేవికి బుణ్యముగా సబ్బాంబికాపుర మనిపేరు పెట్టి గొండనాతవాడిలోని కాకొల్లుగ్రామమును; తనతండ్రి భీమరాజునకు బుణ్యముగాను భీమవర మని పేరుపెట్టి గొండనాతవాడిలోజింజిపాడు, చ్వల్లగర, తాడువాయి అనుగ్రామములను; తనజ్యేష్టసోదరుడు చోడరాజునకు బుణ్యము గాను చోడవర మని పేరుపెట్ట గొండజాతివాడిలోని యమ్మలపూడి గ్రామమును; తనకు బుణ్యముగాను జగమెచ్చుగండాపుర మని పేరుపెట్టి గొందజాతవాడిలో కుంటిమడ్ది, ఉప్పలపాడును, కొందపడమటిసీమలో సత్తెనపల్లి, చింతపల్లి, కేతపల్లి, ఎఱ్ఱగంట గ్రామములను, దొడ్దికండ్రవాడిలో నింకదొనగ్రామమును, బ్రాహ్మణోత్తములకు దానము చేసెను.
                  కోటబయ్యల మహాదేవి.
    నతవాటిసీమకు బరిపాలకు డయిన శ్రీమన్మహామండలేశ్వర రుద్రదేవ మహారాజునకు గొమార్త యైన బయ్యలమహాదేవి పై కెతరాజునకు బట్టమహిషి యని గనుపట్టుచున్నది. ఈమె క్రీ.శ.1234 వ సంవత్సరము వఱకు జీవించియు న్నట్లు కనబదుచున్నది.  ఆ సంవత్సరమున నీమె ధాన్యకటములోని బుద్ధదేవుని దీపమునకై నెతినిసమకూర్చుటకై గొఱ్ఱెలను బోయలకు దానముచేసి యున్నది.  ఈమె పుట్టినింటివారుగూడ చతురెధకులస్ధుల మని చెప్పికొనియున్నారు. ఈమె కాకతీయగణపతిదేవచక్రవర్తి తోబుట్టువగు మేళాంబిక లేక మైలమ్మయొక్కకూతురు. ఈసంగతి మఱియొక తావున సవిస్తరముగా దెలుపబడును.