పుట:Andhrula Charitramu Part 2.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"శ్లో. గోంకక్షేతీశశశినో భగినీ గణాఢ్యా
      సబ్బాహ్వ;యా కమలచారుతరా స్ఫుటశ్రీ:
      తస్యాఓభవత్ ప్రియతమా పురుషోత్తమస్య
                  ... .... .... ... ....
      తస్మాత్తస్యాం సమజనిసుధారశ్మి కాంతి ద్వివస్వ
      త్తేజోరాజ ద్గుణగణనిధి: కేతుభూపోzభిరూప:."
     

అనికేతరాజు తండ్రి భీమరాజు గొంకరాజుసోదరిని వివాహమాడినట్లును దెలుపబడినది. కాబట్టి కోటభీమరాజు క్రీ.శ.1182వ సంవత్సరమునకు బూర్వము ధరిణికోటలో బరిపాలనము సేయుచుండెను. వీరలుభయులును పల్నాటివీరచరిత్రమున బేర్కొనబడిన కేతరాజు తనశాసనములో దన పూర్వులను గొందఱను బేర్కొని యున్నాడు. భీమరాజునకు (మొదటి) కేతరాజు, కేతరాజునకు(మొదటి) భీమరాజు, భీమరాజునకు (రెండవ) సబ్బమదేవియందు దాను జనించినట్లు చెప్పుకొని యుండుటచేత ధరణికోటరాజులలో కేతనామము గలవారిలో నితడు రెండవవాడుగా నుండెను. కోటభూతమదేవి భర్తయైన గండభూపతికిని కేతరాజితండ్రియైన భీమరాజునకు గల సంబంధము తేటపడనున్నయది. అయినను వీర లిరువురు నేకకుటుంబములోనివారే యైయుండవలయును. కేతరాజునకు చోడరాజును జ్యేష్టసోదరు డొకడు గలడు.

                        బౌద్ధమతము - బుద్ధునిపూజలు.
       కోటకేతరాజుకాలమున బౌద్ధమతమును బుద్ధునిపూజలు నాంధ్రదేశమున బూర్తిగా నశింప లేదని కేతరాజుశాసనమువలన దెలియుచున్నది. ఇతనికాలము నాటికి ధాన్యకటకములోని బుద్దునిచైత్య మింకను సురక్షితముగానే యున్నట్లు గాన్పించుచున్నది. ఇతడు శా.శ.1104 గవ సంవత్సర మాఘశుద్ధదశమీ గురువారమునాడు శ్రీమద్భద్ధదేవునకు కండ్రవాటిలోని క్రంతేరు, కొండపడమటి సీమలోని మేడికొండూరు, డొంకిపఱ్ఱు, అనుగ్రామములను దానముచేసెను. బుద్ధదేవుని దీపారాధనమునకై నేతికొఱకు గొఱ్ఱె