పుట:Andhrula Charitramu Part 2.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మఱియు నీపట్టణములోని ప్రజలయొక్క వైభవమును నాకవి యాగ్రంధము నందే యిట్లభివర్ణించి యున్నాడు.

      "గీ. మంటికడన నులకమంచంబు పూరిల్లు
           నూలిచీర తర్నకీలితంబు
           గాని పైడితొడవు గలుగు టెఱుంగరు
           ధనదుపురములోని జనము లెల్ల."

శ్రీవెలనాటి గోంకనరేంద్రునిమంత్రులలో నొక్కడైన మనప్రోలనాయకుడు శా.శ.1031 సంవత్సరము (క్రీ.శ.1102) లొ ధరణికోటలోని అమరేశ్వరస్వామివారికి జేసిన దానమునుగూర్చిన శాసన మొకటి యాదేవాలయములోని ముఖమండపమునకు నైరృతమూల నున్నస్తంభముమీద నున్నది. ఆశాసనమునందు:-

     "క.శ్రీరాజప్రతిశాసను
          డారాధితనీలకండు డభినవమది నా
          కారుడు ప్రోలడు నిబుధా
          ధారుడు (నంబ్నెన్న రాంపికి) తనయుడు నెగడెకొ."
ఈప్రోలనాయకునిభార్య కొమ్మసాని.

                     కోటగండభూపతిరాజు - భూతమదేవి.
      క్రీస్తుశకము 1160 దవ సంవత్సరమ్న కోటగండభూపతిరాజు యొక్క భార్యయైన భూతమదేవి చేసినదానములనుగూర్చిన శాసనములు గుంటూరు మండలములో నున్ంవి. ఆమె తన భర్తయొక్క వంశ నిట్లు చెప్పియున్నది. ధనంల్జయగోత్రమున చోడరాజును, వానికి గండభూపతియును, వానికి ముమ్మడిభీమరాజును, వానికి గండభూపతిరాజును జనించినట్లు పెదమక్కెన్ శాసనమున జెప్పియున్నదిగాని, ప్రోలనాయకునకు వీరలకు నెట్టి సంబంధము గలదో తేటపఱిచి యుండలేదు. ఈశాసనమును బేర్కొనంబడిన రాజుల వృత్తాంతము లేసమాత్రమును దెలియకున్నది.