పుట:Andhrula Charitramu Part 2.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వీరిబంధువు లెల్లరును వీరికి సామంతులై కమ్మరాష్ట్రములోని యుత్తరభాగ మును బాలించుచుండిరి. మున్నోకప్పు డాంధ్రసామ్రాజ్యములో జేరి పశ్చిమ భారములుగా నేర్పడి యుండిన కుంతల కొంకణదేశములనుండి యేతెంచి కమ్మనాటియం దధికారమును వహించి ప్రఖ్యాతిగాంచిన యీప్రభువులె యాంధ్ర దేశములోని యితర భారములకు బోయి యధికారము సలుపునపుడు మొదట కమ్మనాటిరెడ్లు లేక కమ్మవారని వ్యవహరింపబడిరి కాని మఱియన్యముగాదు.1 వీరు మొదట జైనమతావలంబకులుగను తరువాత శైవులుగ నుండిరి.

                          కోటవంశము.
      కోట యన ధరణికోట యనిభావము.  ఈ ధరణికోట ప్రాచీనకాలమున నాంధ్రచక్రవర్తులయిన శాలివాహనులకు రాజధాని నగరమై ధాన్యకటక మను పేరిట జగద్విఖ్యాతియశంబు గాంచియున్నది. ఇయ్యది ఢాన్యాంకపుర మనియు, ఢాన్యవతీ పుర మనియు శాసనములం బేర్కొనబడినది. పండ్రండవ పదమూడవ శతాబ్ధముల్లో దీనిని బరిపాలించిన రాజులను కోటవంశమువారని వ్యవహరించు చుండిరి గాని కోట యనునది ఢరిణికోటనుండి కలిగిన సంజ్ఞకాని మఱియెండు గాదు. వీరలు విష్ణుపాదొద్బవసంభవులయిన చతుర్ధాన్వయుల మని చెప్పుకొని యున్నారు.  ఈ చతుర్ధవంశమున మొదట ధనంజయుదు జనించినట్లుగా కోట భూతదేవిశాసనములోని యీ క్రింది పద్యమువలన బోధపడుచున్నది.2

"చ, అమలపయోనిధి జండ్రు డుదయింబగునట్లునెపోలె పారిజా
      తమున విరించిపుట్టినవిధంబున గాంచనధారుణీధ రేం
      ద్రమున సురావనీజ ముదితంబయి యొప్పగతిం జతుర్ధవం
      శమున జనించె నుగ్రరిపుసైన్యజయుండు ధనంజయుం డిలన్."


1. ఇప్పటి కమ్మవారిలో నితరజాతివార లనేకులు కలిసి యున్నారు. 2.గుంటూరుజిల్లా పెదమక్కెరగ్రామమునకు తూర్పున ఉన్న శిలాస్తంబము మీది శాసనమును జూచుకొనదగును.