పుట:Andhrula Charitramu Part 2.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

డహంకారగరిమచే గదనభూమికి వచ్చి శత్రుసైన్యములమార్కొని సోదరులతో గూడ మృతినొందెను.

                   మలిదేవరాజుల మరణము.
       తమసోదరుడైన నరసింహభూపతి మరణమును విన్నతోడనే బాలమలిదేవరాజులు గుండేలడలి చచ్చి రని చెప్పబడిందిగాని యదియే నిక్కమైన యెడల వారలు మాయొపాయంచే జంపబడియుందుర్. వీరలకు రక్షకుడుగ నుండిన మాలకన్నమనాయుడు వారలు మరణమునొందినతోడనే సైన్య్హములోనికిమరలివచ్చె నని చెప్పబడియుండుటచేత నతడే వారల బంపి యుండు నని సందేహింపవలసివచ్చునుచున్నది.
                        మూడవ యుద్ధము.
      బాలనాయుడు మొదలగు మహావీరు లందఱు సంగ్రామస్థలంబునం బడుటకు సంతోషించి నాయకురాలు బ్రహ్మనాయని సమస్తసైన్యముల నాశనము చేయవచ్చునని తలంచి నూత్నసైన్య్హమును గొంత మరల బ్రహ్మనాయనిపైకి బంపెను. ఈ యుద్ధమునందు కొమ్మరాజు పెద్దనాయుడు నాయకురాలి సైన్యముల నోడించిరి గాని, యుద్ధములో కొమ్మరాజు ప్రాణంబుల విడిచెను.
                        నాయకురాలి యుద్ధము.
       ఈ కడసారియుద్ధమున బ్రహ్మనాయని కెదురుపోటీగా రాజ్యతంత్రము నడపినట్టి మహాసమర్దురాలును, మగబిరుదుగట్టి యశ్వారూఢయైయుద్దావ సానము వఱకు నించుకయు జలింపక బ్రహ్మనాయనితొ బోర సమకట్టిన నిరుపమానశూరురాలును అగు నాయకురాలు తన సైన్యమునకంతకు దానే యధ్యక్షురాలుగ నేర్పడి నాలుగుభాగములు గావించి నాలుగు ప్రక్కల శత్రువుల మార్కొనుటకై నిలిపి యుంచెను. బ్రహ్మనాయని పక్షమున రేచెర్ల పేరినీడు, గండుకన్నమనాయుడు, సుంకరదాసునాయుడు, మాలకన్నమనాయుడు, అను నల్వురు సేనాధిపతులును నాయకురాలి నాల్గుభాగములను