పుట:Andhrula Charitramu Part 2.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

       ఉభయసంస్థానంబు లొక్కటేమాకు
       ననుగు రాజేంద్రుడు హరిపురి కేగు
       సమయంబునను బుత్త్రచయమును దెచ్చి
       మాకు సమర్పించి మేము త్యతించె
       దర్వాత నిర్వాహదశయెల్ల నీది
       యొకయిల్లు రెండుగ నొప్పనొనర్చి
       తడ్డు మాటాడెనే యెపు డెనదైన
       మతిచెడి యీలోఅ మనసులు గలగె
       నిండుచే బగహెచ్చె నీర్ష్య జనించె
       గోడిఓరాడుట కూడదటంచు
       నిచ్చతో జెప్పిన నెవ్వరు వినిరి?
       గురిజాలపురికిని గోడిపోరాడ
       నెవ్ఫరు వచ్చిరి యిదియేమి మాయ
       వనట్టికార్యంబు లన్నియు నీకు
       దెలిసియే యున్నవి తేటతెల్లముగ
       గతజలంబుల కడ్డుగట్టిన రీతి
       జరిగిన దానికి జర్చలేమిటికి
       వనలీవలివారి నరసి రక్షింప
       భారంబు నీయది బ్రహ్మనాయుండ !
       కౌరవతతినెల్ల గదనంబునందు
       గూకటివేళ్లతో గూల్చి యామీద
       బహుళార్తింనడవులపాలైరి గాక
       పాండవు లేమేలుపడసిరి చెపుమ?
       చేరి మీరొకనరసింగునికొఱకు
       సకలభూపరులను సమయంగ జేసి
       పాడైనరాజ్యంబు పైన్మబెట్టికొని