పుట:Andhrula Charitramu Part 2.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

        మాటాడి యటమీద మాచెర్లబాగ
        మేలుకొమ్మని చెప్పు డింకొక మాట
        నాయనివద్దకు నరసింగు దెచ్చి
        కులవైర మడతుము కోరి మారంద
        ఱొక్కటికమ్మని యొప్పించి రండు
        మగిడి పోవలయును మనదేశమునకు"

    అబు చెప్పి సంధికార్యము నెఱవేర్పం బంపించెను. కేతరాజు మొదలగు రాయబారులు పెదమలిదేవమహీపతి కొల్వునకు వచ్చి యెండొరుల క్షేమ సమాచారములు దెల్పుకొన్న తరువార నలగామరాజుచే మన్ననగాంచిన పిమ్మట కేతరారు బ్రహ్మనాయని నిట్లని హెచ్చరించెను.

     "వినవయ్య నాయుడ విన్నపం బొకటి
       మీదృశు లయినట్టి మేటి విక్రములు
       నీతిమంతులు లేరు నిశ్చయం బిరియ
       గొంతుగోయగ మీరు కోరినయట్టి
       నరసింగరాజును నయమున దెచ్చి
       యిచ్చెద నామీద నేమైన లెస్స
       సరవిర్ఫక్షించిన సంహరించినను
       భారంబు మీపైన బాదుకయుండు
       మునుపటిరీతిని ముడమొప్ప మీరు
       మాచెర్లభారంబు మక్కువ నేలి
       సంరక్షణముసేయు జనములనెల్ల
       నుభయరాజులుమీర లొక్కటై యున్న
       మావంటివారికి మానసంఅ బలరు
       నఖిలాధిపతులు మీయాజ్ఞ సేయుదురు
      మీ రెఱింగిననీతి మే మెఱుంగుదుమె