పుట:Andhrula Charitramu Part 2.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

      ప్రజలెల్ల నశియించి పాఱిపోవుదురు
      బండారమునకును బైకంబు లేదు
      రాణువయందుచేరహిచెడియుండు
      జేజీతగండ్రెల్ల జెలగి కోపించి
      యీగలజీతంబు లిమ్మందు రపుడు
      పతిబంటు మేరలు ప్రిహరమౌను
      బంపినబనిసేయ బ్రాలుమాలుదురు
      తెలిసినశాత్రవుల్ ధీరతతోడ
      భూమినికొనుటకు బుద్ధి వెట్టుదురు
      పగవారివార్తలు పరికింపలేరు
      మేకొనిమీలోన మీరుపోరాడ
      జూచెడువానికి జులకన యౌను
      (కోరిశాత్రవులు మీగుట్టేఱుంగుదురు)
      వలువలు మింజేఱి పగజాననీక
      చెప్పుచునుందురు మొదటివాక్యముల
      నైకమత్యముచెడు నద్దానితోడ
      జెడుమాశంబును జేడును శౌర్యంబు
      జెడునురాజ్య్హమ్మును చెడ్డపిమ్మటను
      దేశంబు సాధీన నృపరమౌ సుమ్ము"

  అని భట్టుమూర్తి సంధివాక్యములను పలుకగా నలగామరాజువానిని ధృణీకరించి  సంధి పొసంగ నేరదనియును, బ్రదుకదలంచినయెడల బాలరాజులను దిన్నగా దోడ్కొని మరలిపొమ్మనియును, అట్లు పోకయుండిన రణభూమికి బలిగ నర్పింతుననియును, బ్రహ్మనాయనికిజెప్పి బుద్ధి గఱప వలసినదనియును బలికెను.