పుట:Andhrula Charitramu Part 2.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నుండి బయలుదేఱి ప్రవేశించి యుద్ధమున కాయత్తపడుచున్న వీరనాయకుల వేగము వలదని వారించుచుండెను.

                 నలగాముడును యుద్ధసన్నద్ధుడగుట 
       అచట గురిజాలలో నలగామరాజుసయితము నాయకురాలి ప్రేరణ వలన బ్రహ్మనాయనితో యుద్ధముచేయ నిశ్చయించి యుద్ధవార్తను నానా దేశరాజులకు దెలియజేసి వారల సాహాయ్యమును బడయుటకై ప్రయత్నించెను. ఇంతలో బ్రహ్మనాయనియొద్దనుండి యొక బట్టుతువాడు రాయబారమును బూని నలగామరాజుసభకువచ్చి యతనిచే నర్హసత్కారములనుగాంచి మలిదేవరాయలు కార్యముపూడికి దాడివెడలివచ్చియున్నారనితెలిసి సంధి కార్యమునుగూర్చి యిట్లు పలికెను.

    "రాజాధిరాజవిరాజతకీర్తి
      రాజవేశ్యావిటప్రాభవప్రకట
      గండరగండాంక ఘనదానచతుర
     ధైరనిర్జితమేరుధరణీధరేంద్ర
     కౌర్యవిక్రమకళాసంపూర్ణచంద్ర
     భాస్కరసమతేజ ప్రౌఢగుణాఢ్య
     మానదుర్యోధన మైలమసుతుడ
     అనుగుభూపతిఉత్త్రయంచికగాత్ర
     వీరికామనరేంద్ర విభవదేవేంద్ర
      * * * * *
     పగ వృద్ధిబొందించు భ్రష్టులే కాని
     యడగించు నేర్పరు లవనిలో లేరు
     * * * * *
     పోరుమంచిదికాదు భూమినెక్కడను
     బాడౌ నుదేశంబు పగ మించెనేని