పుట:Andhrula Charitramu Part 2.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

     "ఘోటకంబులు మేటికుంజరావళులు
       నుత్సాహమున హుటాహుటినడువంగ
       బట్టువారలుమించి బహువిధంబులను
       బిరుదుపద్యంబులు వెళ్లుగా నడువ్ అ
       నుద్దండమాస్టీలు నొనర నిర్వంక
       భైరనఖడ్గముల్ పట్టుక రాగ
       శీలమ్మతనయుని సింహవిక్రముం?డు
       కతమద్ధికునుకులకన్న మనడిచె
       సకలవీరచయంబుసంతతోత్సాహ
       పౌరుషంబులుమీఱ బ్రహ్మ కిట్లనియె
       "మముజూడుబ్రహ్మన్న మాశౌర్యపటిమ
       సింధురంబులమీద జెన్నుగా డుమికి
       కుంభస్థలంబులు త్రుంగజేసెదము
       కొదమసింగంబుల గూలద్రోచెదము
       గండభేరుండాల ఖండింతుమలుక
       వాయువుబోనీక వదైనాపగలము
       జాతవేదునిబట్టి చమిరివైచెదము
       భువనసముద్రముజొచ్చి కలుగజేసెదము
       కుంభిని గాళ్లతో గ్రుంగదన్నెదము
       కులగిరులైనను గొట్టివైచెదము
       గురిజాలనేలెడు కువలయేశ్వరుని
       గొలపగకైపట్టి క్రొవ్వణగించి
       చలమునకుడనక చంపగా గలము"
       అని పెక్కుపంతంబులాడుచు నడువ