నాయుడు రాజులు నయముతో జనగ
ముందుడమాయీలు మురజసంధుంబు
బూరలు భేరీలు పోటుధారలును
గాహళనంకిణి కాలికొములును
శంఖసమూహంబులు సన్నాయిజోళ్లు
మురళీచయంబును ముఖవీడె నితతి
నరగలుతప్పెటల్ నయమైన దోళ్లు
తమ్మటమ్ములు నెంచ దగు వీరణములు
ఘనమైనరుంజలు కనకతప్పెటలు
చేగంటలును మఱి చిఱుగంటవయము
ఘనమైనమ్రోతచేగగనంబు గప్ప
గంభినివణకంగ గులగిరులెల్ల
బ్రతిమ్రోతలీయంగ భావ ముప్పొంగ
నావాలవారును నాణెమువారు
ముతిసానివారును ముయ్యూరువారు
నర్మాలవారును నాయనివారు
పైడిచుక్కలపాలపర్తి వారలును
బలుమూరివారును బాలెమువారు
రేవనూళులవారు రేచెర్లవారు
నట్లూరిముట్లూరి యాఖ్యలవారు
చెవులవారుని మఱి చిల్లరవారు
గురియైననాయకుల్ గూడియేతేర
గండువా రేగురు గదిసినవేడ్క
జనిరి బిరుదులతో సాహస మదర
నొప్పగా నిందఱు మఱువిఅనబంట్లు
పుట:Andhrula Charitramu Part 2.pdf/248
స్వరూపం
ఈ పుటను అచ్చుదిద్దలేదు
