పుట:Andhrula Charitramu Part 2.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సినదని ప్రార్ధించెను అందులకు నలగామరాజు సమ్మతింపక పరుషోక్తులాడెను. అత డాగ్రమ. అతడాగ్రమునుజెంది యచోట నుండనొల్లక చెర్లగుడిపాడునకు వచ్చెను. అచ్చట గనమదాసును గలిసికొని తనకార్యము నెఱవేర్చుకొని గాని బ్రహ్మనాల్యనికడకు బోనని ప్రతిజ్ఞ చేసెను. ఇంతలో నాయకురాలొక బ్రహ్మణునకు విసేషదనము నొసంగి వానిచే రాచమల్లునకు విషము పెట్టించి చంపించెను. వానిభార్య పేరమ్మ, తనతండ్రియైన నలగామరాజునును దూషించి దు:ఖించుచు భర్తతో సహగమనము చేసెను. అంతట నిరుపక్షములవారును ఘోరావహమును సలుపుటకు సర్వప్రయత్నములను చేయుచుండిరి. వీరులు కొందఱు బ్రహ్మనాయనిప్రక్కను నిలిచి ప్రాణము లున్నంత దనుక నాతనికై పోరాడెద మని ప్రతిజ్ఞావాక్యములు పలికిరి.

               బ్రహ్మనాయుడు యుద్ధమునకు వెడలుట.
      బ్రహనాయుడు యుద్ధముచేయుటయే విధికృత మైనధర్మమని నిశ్చయించిన వాడగుటచేత బాల మల్లదేవుని వీరమేడపికి బట్టుముగట్టి తనపుత్రుడైనబాలచంద్రుని సచివకార్యమునందు నియోగించి శరణకార్యం బనపోతనకిచ్చి చూడచి యను వీరవనితను రాణీవాసమునకు రక్షకురాలిగం జేసి తన పక్షమునబూనివచ్చిన వీరనాయకులతొ నొక్కశుభముహుర్తమున దాడి వెడలెను. బ్రహ్మనాయుని దండయాత్రాప్రారంభము వీరచరిత్రమున నిట్లభి వర్ణింప బడియెను.

       "బ్రహ్మన్న గదలెను బాయని వేడ్క
         బట్టిరిగోడుగు లు పాలకినెత్తి
         సూర్యాంతపంబు పై సోకనియట్లు
         పాలకీలను నిరుపార్శ్వంబులందు
         నందంబుగాబట్టి రేరిగెలజోళ్లు
         వింజామరింబులు వెలయగా నెమలి
        కుంచెలవారును గూడివీనంగ