పుట:Andhrula Charitramu Part 2.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"శ్లో. రాజత్కీర్తే గ్గణపతినృప స్వాఖిలోర్వీశమాడా
      రత్నవ్రాతడ్యుతితతిసము ద్భాసితాశ్ఘ్రిద్వయస్య
      సన్మర్యాదానిరతనిఖిలక్ష్మాననే వర్తమానే
      రమ్యే రాజ్యే విపులసుఖదే ప్రోన్నతిస్య ప్రహర్షై:"

సమస్తభూపతుల కిరీటరత్నకాంతులచే బ్రకాశింప జేయబడిన పాదయుగ్మము గలికి ప్రహర్షముచే నిండియున్న గణపతిదేవుని రాజ్యకాలమున అని మాత్రము చెప్పిన తరువాత నామెదానధర్మమును గూర్చి ముచ్చట్ంప బడియెను. అంతియగాని తనభర్త యైన బేతిరెడ్డి గణపతిదేవచక్రవర్తివలన విశేష రాజ్య,మువైభవములను గిరీటమును దక్కుంగల యాయుధ విశేషంబు లను బడిసినట్లు చెప్పియుండలేరు. ఇంక నామిరెడ్డి శాసనమున గణపతిదేవ చక్రవర్తి వర్ణింపంబడిన పిమ్మట.

"శ్లో. తస్య ప్రసాదా త్పృధువిఅభవస్య;
      పృధుప్రదానస్యవిభో: పృధుశ్రీ:
      నామ కృతిస్తుత్యగంణాభిరామ:
      కాచామ్బకామాను రమానవత్త్వ:"

అని గణపతిదేవునియొక్క ప్రసారముచేతనే యధికవైభవమును, అధిక సంపదయును, మొదలగువానిం బడసినట్లు చెప్పంబడి యున్నది. ఇట్లే మొదటి శాసనమున బ్రతాపరుద్రునిప్రసాదముచేతనే నామిరెడ్ది పిల్లలమఱ్ఱి గ్రామంబునగట్టించిన రామేశ్వరకాచేశ్వర నామేశ్వర దేవాలయంబులు లేక కిరనగరంబున బ్రతాపరుద్రుండ్ నిర్మింపించిన యాలయత్రయంబు చందంబున నత్యున్నతములై లోకోత్తరశిల్పులతో గురివిందశిలా మయ ములై వెలయుచున్నవి. ఎఱ్ఱక్కసానిశాసనమునాటికి బేతిరెడ్డి మరణమునొందియుండుటచేతనే యామె తనయత్తింటివారియొక్కయు బుట్తినింటివారియొక్కయు వంశాభివర్ణనముగావించి తన ధర్మములను గూర్చి చెప్పుకొనుట తటస్థించినది. ఈవిష