పుట:Andhrula Charitramu Part 2.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(2) ఇతనికి జెవ్విరెడ్డి యను జన్మనామము మాఱి బేతాళరాయుడను నామము గలుగుటకు గారణ మత్యద్భుతముగా నీక్రిందివిధమున శ్రీవెలుగోటి వారి వంశచరిత్రమునందు దెలుపబడియున్నది. బేతిరెడ్డికి బూర్వమున బదెవ తరమువాడగు హేమాద్రిరెడ్డి మహాభుజపరాక్రమము గలవాడై రాజ్యపరి పాలనము సేఉచు గోట్లకొలది ధనము గడించి యామనగంటి కుత్తరభాగమున 4 మైళ్లదూరమున నొకచోట భూమిలో బాతిపెట్టి వానిపైనొకవేదిక గట్టించి యందు నొకవటవృక్షమునువేసి దానిక్రింద నిభైరవుని బ్రతిష్టించి 'ధనమును గాపాడి తన కులములో జనించినవారిలో సద్గుణ గరిష్టుండు నై కులదీపకుం డగువానికి సంఘటిల్లజేయవలయునని ప్రార్ధించి తనయభిప్రాయమును దెలిఉనట్లు భూమి లో గుప్తముగ నొకశిలాశాసనమును స్థాపించెనట! అనంతరము కొంతకాలము నకు వానివంశమున జెవ్విర్తెడ్డి యుదయించి లోకో త్తరవీర్యసంపన్నుడై చండ మార్తాండుని చందమున దేజరిల్లుచు రాజ్యముచేయుచుండి యొక్కనాదు మృగ యావినోదార్ధమై వెడలి పరిజనుల్ వెనుకదిగంబడిన నొక్కడుగా హేమాద్రిరెడ్డి ధననిక్షేపముచేసినప్రాంతంబునకు దైవైకంబునబోయెనట ! అచట నీతని పోష్య వర్గములో జేరిన రేద డను మొకమాలవాడు భూమి దున్నుచుండి దైవాధీనము గ హేమాద్రిరెడ్డి స్థాపించిన శిలాశాసనము నాగేటిమొనకు దాకి బయల్పడగా వాడు తన యేలికపోవుచుండుటను జూచ్వి యావృత్తాంతం బంతయు విన్న వించెనట! అంత చెవిరెడ్డి యచ్చటికిబోయి యాశిలాశాసనము నవలోకించి యాపద్వృతాంతమును దెలిసికొని యాధనము గైకొనుటకై ప్రయత్నింపగా నాచెంత నున్న వటవృక్షము నాశ్రయించుకొనియున్నబేతాళుడాయన ధైర్యమును బరీక్షించుటకై మాయాతిమిరమును మేఘములు నుఱుములు మెఱుములు వానయు గాలియు గల్పించి పిడుగులుపడునటులజేసెనట! అంతియగాక యా వటవృక్ష మాతనియెదుట గూలద్రోసెనట! అప్పుడు రేచడు మూర్చిల్లెనటగాని చెవిరెడ్డి భీతిల్లక నులువంబడగా బేతాళుడు ఘోరాకృతిని బూని చెవిరెడ్డిమీదికి రాగా నాతడు