పుట:Andhrula Charitramu Part 2.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

       కాన్తిప్రతాపవిభవా ద్దదత: ప్రభావం
       వ్యక్తం జనే శశిరధామ సహస్రప్రధామ్నో:"

అని గణపతిదేవరాజును బేర్కొనియుండుటచేత నితడు గణపతిదేవుని రాజ్య ప్రారంబకాలమునగూడ నున్నవాడని వేద్యమగుచున్నది. క్రీ.శ.1208 దవ సంవత్సరములో బేతిరెడ్డిభార్య ఎఱ్ఱక్కసానమ్మశాసనములో నామిరెడ్డి శాసనములోని వంశావలియే సరిగా జెప్పబడినదిగాని తుదకు నామిరెడ్డికిని, కాచమ్మకుని ఆమెబర్త యైన బేతిరెడ్డిజనించె నని చెప్పబడినది. నామిరెడ్డిపేరెత్త లేదు. మఱియు నామిరెడ్డిశాసనములో నామిరెడ్డికింగల బిరుదానళులే బేతిరెడ్డి కిని జెప్పబడియెను. ఇంతియగాక యెఱ్ఱక్కసానమ్మశాసనమునాటికి బేతిరెడ్డి బ్రతితకియున్నఘ్లు గన్పట్టదు. అదియునుగాక యామెశాసనములో ఎఱ్ఱక్క సానికి బేతిరెడ్డివలన మల్లారెడ్డి యనుకుమారుడు జనించెనని చెప్పుబడుటయే గాక యాతని గుణవిశేషాదులును, బౌరుషారాక్రమములును వర్ణింపబడినవి. ఈశాసనములు మూడింటిని బరిశీలింపగా నీక్రిందివిధమున దోచుచున్నది. క్రీస్తుశకము1194 దవ సంవత్సరమున బేతిరెడ్డే యామనగల్లుదుర్గమునకధిపతి యై పరిపాలనము జేయుచు ఎఱ్ఱక్కసానిశాసనములో నుదాహరింపబడిన బిరుదావళులను వహించియుండె ననియు, ఆకారణముచేత నతని తమ్ముడైన నామిరెడ్డి యప్పటి కాబిరుదములను వహించి యుండ లె దనియు 1202 వ సంవత్సరమునాటికి నామిరెడ్డి యాబిరుదములను వహించియుండుటచేత నప్పటికి బేతిరెడ్డి మృతినొందియుండె ననియు, అతని మరణానంతరము తమ్ము డాబిరుదములనే వహించి యామనగల్లుదుర్గమున కధిపతియై యుండేననియు దేటపడుచున్నది. ఎఱ్ఱక్కశాసనమునాటికి అనగా 1212 వ సంవత్సరమువఱకు బేతిరెడ్డి బ్రతికియే యున్నయెడల 1202 వ సంవత్సరమున నతనితమ్ముడైన నామిరెడ్డి యన్న గారింబిరుదములను వహింపజాలదు. తనకును దనసోదరునకు నట్టిభేదభానమే లేనియెడల 1194 వ స్ద్సంవత్సరమున నట్టి బిరుదానళులు ధరింపకుండుట తటస్థింపదు. 'కాంబట్టి రేచెర్లబేతిరెడ్డి మొదటి ప్రతాపరుద్రునికాలములోనే యుండెనుగాని గణపతిదేవచక్రవర్తికాలములో