పుట:Andhrula Charitramu Part 2.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాలించుచున్నట్లు చెప్పబడియెను. ఈశాసనమునందు దనతల్లిదండ్రుల నామములనుమాత్రం పేర్కొనియెనుగాని తనవంశమును వర్ణించి యుండలెదు. తానెచ్చటివాడో తనకుం గలబిరుదానళులెట్టివో వానిని సయితము బెర్కొనియుండలేరు. అయినను క్రీ.శ.1202 వ సంవత్సరమునందు పిల్లలమఱ్ఱి గ్రామమున నామేశ్వరదేవునికి భూదానం చేసి మఱియొక శాసనము వ్రాయించెను. ఈశాసనములో దనవంశమును, తనకుం గల బిరుదానళులను బేర్కొనెను. ఇతనివంశవర్ణనమునందు మొదట నీక్రిందిశ్లోకము గన్పట్టు చున్నది.

     "శ్లో. శ్రీమత్పద్మజపాదపద్మయుగళా ల్లోకత్రయాభ్యర్చితా
            దుద్భూతే విపులే కులే నరవరో భీమాభిరామోటభవత్
            య: కసశ్చీనగరెకవాటహరణం కృత్వాప్రవణ్ణాహన
            క్రీడ శ్చోడనరాధిపస్యకృతవా న్మాద్రుమోమ్మాలనమ్"

శ్రీమత్కమలాసమపాదపద్మమునుండి యుదయించిన జాతి(శూద్రవంశము)లో భీముం డనునరవరు డుదయించి కాంచీనగరకవాటమును భేదించి చోడనరాధిపు నితో గొప్పయుద్ధము జేసి విజయము గాంచినవాడని తాత్పర్యము ఈశ్లోకమును బట్టి యితనిపూర్వులు రాజకీయాధికారపదవులయందుండి యుద్ధములనుజేసి ప్రసిద్ధికెక్కిన వారనియే తలంపవలసి యున్నది. ఈభీమరాజు వంశమున ముంజరాజును, అతనికి గామరాజును, అతనికి గాచాంబ యందు నామిరెడ్డియు జనించెను. ఇతనిశాసనములలో నెచ్చటను బేతిరెడ్డి నామము గానంబడదు. "సకలగుణాలంకార, అనునగ్ంటిపుర సరేశ్వర, వీరలక్ష్మీ విజేశ్వర, దోర్బలభీమ, రణరంగరామ, వితరణకర్ణ, శౌర్యస్సంపన్న, పతిహితాంజనేయ, శౌచగాంగేయ, సత్యరత్నాకర, దుష్టజన భీకర, మనుమలాదిత్య, సుభసంస్తుత్య, అనుభిరుదు లీతనికి గలిగియున్నట్లుగా నీశాసనమునం బేర్కొనబడియెను.మఱియు నీశాసనమునందు---

"శ్లో. రాజ్యేమతే గస్నపతే ర్నృపతే స్పుజాతే
       విద్వర్గణప్రణుత సద్గుణరత్నవార్ధె: