పుట:Andhrula Charitramu Part 2.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నొక్కబేతిరెడ్డి, నామము అతనిసోదరు డైన నామిరెడ్డి నామమును దక్క మఱి యెవ్వరిపేరులును విన్ంబడక యున్నవి. రుద్రదేవరాజునకు సంతానము లేక పోవటచేతనేమో మఱియేకారణముచేతనో యతని తరువాత మహాదేవరాజును అతనికుమారు డైన గణపతిదేవరాజును రాజ్యభారము వహించిరి. గణపతిదేవ రాజు తన తండ్రికిని యాదవరాజయిన జైత్రపాలునకును జరిగిన యుద్ధములో దనతండ్రి మరణమునొందుటయేగాక తానుగూడ యుద్ధములో శత్రువుచే దెఱుబెట్టనుండితరువాత జైత్రరాజునిచే విడిచిపెట్టబడినట్లు జైత్రపాలుని శాసనమువలన దెలియుచున్నది.

                        రేచెర్ల బేతిరెడ్డి - రేచెర్ల నామిరెడ్డి.
      ఈమహావీరపురుషు లిరువురును మొదటి ప్రతాపరుద్రదేవమహారాజు నకు భృత్యులై భక్తితోనాతని సేవించుచు నామనగల్లుదుర్గమున కదిపతులై యుద్ధముల నజయ్యులై ప్రఖ్యాతిగాంచినారు. వీరి లిరువురును సోదరులు అయిన నిందెతడు పెద్దయో  ఎతదు చిన్నయో నిశ్చయింప నాకరము గానరాక యున్నది. వీరి గృహనామమున్ రేచెర్ల వారని నామిరెడ్డి శాసనములవలనను, బేతిరెడ్డి భార్య్హయైన యెఱ్ఱక్క సానమ్మ శాసనమువలనను దేలియుచున్నది. వీరిశాసనములు నైజామురాజ్యములోని నల్లగొండజిల్లాలో సూర్యాపేట తాలూకాలో నున్న పిల్లలమఱ్ఱి గ్రామమున గానంబడుచున్నది. రేచెర్ల నామిరెడ్డి క్రీ.శ.1198 దవ సంవత్సరమున బిల్లలమఱ్ఱిగ్రామమున దనతండ్రి కామయపేరిట రామేశ్వరదేవుని తనతల్లి కాచాయి పేరిట గాచేశ్వరదేవుని తనపేరిట నామేశ్వర దేవున బ్రతిష్టాపనం చేసి  గుళ్లుకట్టించి శాసనమువ్రాయించెను. ఆశాసనమునందు, 

    "శ్లో. నానావనీనాధ కిరీటకోటి రత్నాంశుభిక్చు, మృతపారపీరే
           నిర్ధుష్ట మమ్బోనిధివేష్టి తాంతాం విశ్వమ్బరాం శాపతిరుద్రదేవే"

అని నానాదేశరాజుల కిరీటాగ్రఖచితము లగురత్నములకిరణములచేస్పృశింప బడిన పాదపీనముగల రుద్రదేవుడు సమగ్రవేష్టి త మైనభూమిని బరి