పుట:Andhrula Charitramu Part 2.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మును దూగి బ్రాహ్మణకుటుంబములకు ధారవోసి యేక శిలానగరంబునకు విచ్చేసి లక్షలకొలది ద్రవ్యమును వెచ్చించి య నేక శివాలయములను నిర్మించి మఱియు నెంతెంతోద్రవ్యమును వెచ్చించి చతుర్ముఖేశ్వరుని దేవళమును సహస్రస్తంభములమండపమును గట్టించెను. ఇవిగాక గణపతీశ్వరుని యాలయమును రుద్రేశ్వర మనుగ్రామమున రుద్రేశ్వరాలయమును గట్టించి కోనేరు త్రవ్వించి ప్రాకారములు వినిర్మించి యాదేవతల నిత్యోత్సవమునకై చోడ గ్రామముల నొసంగెను.

                    రుద్రదేవుడు విద్యావిభూఅషణుడు.
 ఇతడు సంస్కృతాంధ్రకర్ణాటభాషలయం దభిమానము గలిగి పండితజనంబుల రావించి యాదరించుచు బండితపక్షపాతియై తానును బండితుండు కివియు నై బహుగ్రంధములం బఠించుటయేగాక గ్రంధరచనమునకుం గూడ దొరకొనినటుల గ్ఫానంబడుచున్నది. ఈతనికి 'విద్యావిభూషణు ' డను బిరుదునామ మున్నటుల శా.శ. 1101 వత్సరమున దాక్షారామభీమేశ్వరుని యాలయమున లిఖింపంబడిన శాసనముంబట్టి  దెలియుచున్నది.  మఱియు నిత డాంధ్రభాషలో 'నీతిసార ' మను గ్రంధమును రచించినటులు గంపట్టుచున్నది. ఆత్మకూరు సంస్థానమున సంపాదించిన ప్రతిలో నీక్రిందిపద్యము గలదని తాము ప్రకటించిన బెద్దెనకవిప్రణీత నీతిశాస్త్రముముక్తావళీ గ్రంధమున శ్రీరామకృష్ణయ్యగారు నుడివి యున్నారు.

"చం. పడువడి నాంధ్రభాషగల బద్దెననీతియు సంస్కృతంబుతో
       బరగ బ్రతాప్రుద్రనరపాలునిచే రచియింపబడ్డ యా
       నరవరునీతిసారము వనం బడువం గడు మంచి దండు జె
      చ్చెర గవి నీతిపద్ధతులుచేసె విమోదము బాలబోధకున్."

నీతిశాస్త్రముక్తాంవళిని రచించిన బద్దెనకవినె భద్రభూపాలు డని యీ చరిత్రము యొక్క ప్రధమరకరణమున దెలిపియున్నాడను. ఈభద్రభూపాలునకు నన్నెచోడు డను నామముగూడ గలదు. కుమారసంభవమను