పుట:Andhrula Charitramu Part 2.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డించుచు సంభాషించుచు బ్రీతిబొలుచుచు జెలగుచు బొలయు సముద్య
త్ర్కౌంచగతులు వీక్షించుచు భాస్వజ్జ్వలనుడు శరవణసరసికి వచ్చెన్ ”<br?>

అను వృత్తము భారతములోని క్రౌంచపదవృత్త లక్షణమునకును, కవిజనాశ్రయము, లక్షణసారము మొదలగు లక్షణగ్రంథములలో నుదాహరింపబడిన క్రౌంచపదవృత్త లక్షణమునకు విరుద్ధ లక్షణము కలిగియున్నదనియు, నన్నయకు బూర్వము కర్నాటకభాషలో నిట్టి క్రౌంచవృత్తములు గలవనియు,

"శా. ముక్తాముక్త ఘనానురాగ మదసమ్మోదైక సంసేవ్యసం
త్యక్తాకర్మ పద ప్రభేదమతి విద్యాదేహశోషైకహా
భక్తాలంబక మంత్రతంత్రమయ సద్భావస్థితై స్పృశా
శాక్తేయో ముని చింత్యమాన భరతా సంతాపహా సద్యశా"

అను చక్రబంధములో కృతికర్త, కృతిపతుల నామములు గానరావనియు, పదునొకండవ శతాబ్దమునకీవల చక్రబంధములలో నవశ్యముగా గృతిపతి యొక్కయు, కవియొక్కయు నామములుండుట యాచారమై యున్నదనియు, కాబట్టి నన్నయకు బూర్వమునందిట్టి యాచార మున్నదనియు,

నన్నయకు బూర్వము ముప్పదియారలంకారములు మ్రాతమె కలవని భామహుడు దండి మొదలగువారు పేర్కొని