పుట:Andhrula Charitramu Part 2.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనగా *గోవిందరాజ వంశమునందు జనించినట్టియు, లుంకాకవిషయాధీశ్వరు డైనట్టియు, పరశువుతో యుద్ధముజేయునైపుణ్యం గలట్టియు, ఈడప్ప యనువా డొకడు బధింపబడి ప్రోలరాజువెదుటకు తేబడెననియు, వీరదీక్షాగురుం డైన ప్రోలరాజు పశ్చాత్తప్తుడై యున్న యాతని బంధవిముక్తిని గావించి యతని రాజ్యము మరల నాతనికి నొప్పగించెననియు, తాత్పర్యం.

                       ప్రోలరాజు గుండరాజును జంపుట
    కాకతిప్రోలరాజు మంత్రికూటపట్టణాధిపతి యైనకుండరాజుపై దండెత్తిపోయి యతనితో యుద్ధముజేసి జయుంచి యంతటితో బోనక యాగ్రహమహోగ్రుడై యతనిని బట్టికొని శిరమును గొఱిగింపించి వక్షస్థలంబున వరాహముద్రనుబొడిచి చంపె నని రుద్రదేవుని యనుమకొండశాసనమునందే యీ క్రిందిశ్లోకమున జెప్పబడినది.

    "క్రుద్దేనోద్ధుగ మంత్రకూటనగరీనధోదయో నిస్త్రపో
      గుండ:ఖండిత ఏర ముండితశిరా: క్రోడాంకవక్షస్థల:
     ఏడోడింభకవత్పలాయనపరో జ్ఞాతో గర:స్వాం పురీ
     ఆహుతోని సరేశ్వరస్యపరత: ప్రోలేన యుద్ధాయయత్,"

మంణ్త్రకూట మనునది నైజామురాష్ట్రములో గోదావరీతీరమున నున్న మంధని యను గ్రామ మని కొందఱున్, కృష్ణామండలములో నూజివీడుతాలూకా


  • ఇందు బేర్కొనబడిన గోవిందరాజు కుంతలదేశమును పరిపాలించిన రాష్ట్రకూట రాజులలీనివాడని శ్రీరామమూర్తిపంతులుగారు వ్రాసియున్నారుగాని యాకాలము నాటికి రాష్త్రకూట సామ్రాజ్య మంతరించి యుండుటచేత్య నది యంతగా విశ్వసపాత్రము గాదు. పైశ్ళొకముయొక్క పాఠాంతరముగూడ సరియైనదిగా గను పట్టదు. నేను వ్రాయించి తెప్పించిన యనుమకొండ శాసనముయొక్క ప్రతిగూడ డాక్టరు ప్లీటుదొరగారు ప్రకటించిన పాఠముతో సరిపోవుచున్నదిగాని పంతులువారిపాఠాంతరముతో సరిపోవుచుండలేదు.